చిలిపి ప్రశ్నలు
కొన్ని వాక్యాలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, అలాంటి కొన్ని చిలిపి ప్రశ్నలు వాటి సమాధానములు
నీరు లేని వెల్ ఏమిటి? ట్రావెల్ |
కనిపించని వనం ఏమిటి? పవనం. |
గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? పకోడి |
ఆయుధంలేని పోరాటమేమిటి? మౌనపోరాటం. |
వీసా అడగని దేశమేమిటి? సందేశం. |
అందరూ నమస్కరించే కాలు ఏమిటి? పుస్తకాలు |
అందరూ భయపడే బడి ఏమిటి? చేతబడి. |
వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? ఫైరింగ్ |
ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? న్యూస్ పేపర్. |
పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? గ్రానైట్ |
మనిషి కాళ్ళు ఎంతపొడవు ఉండాలి? నేలకు అందేంత! |
ఆ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ లేరు. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు? అది తన ఇల్లే కాబట్టి! |
ఆఫ్రికా గిరిజనులు అరపండు ఎలా తింటారు? ఒలుచుకొని ! |
బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? పట్టినంత మంది! |
దోమ తన పిల్లని సర్కస్ గుడారంలోకి వెళ్ళద్దని చెప్పింది. ఎందుకు? అందరూ చప్పట్లు కొడతారు కాబట్టి! |
తన పిల్ల కనబడకపోతే కంగారు ఏమని ఏడుస్తుంది? 'నా జేబు ఎవరో కొట్టేశారు!' అని! |
గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు? నుదుటికి! |
నాలుకపై పెడతారుగానీ మింగరు.. ఏమిటది? తపాలా బిళ్ళ! |
చింటూ చాల్-లేట్ ఇస్తే తినలేదు ఎందుకు?చాకును ముందిచ్చినా లేటుగా ఇచ్చినా తినలేడుగా! |
రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు. ఎలా? రసం తీసి! |
డ్రైవర్ లేని బస్ ? సిలబస్! |
చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది? కప్పు ఖాళీ అవుతుంది. |
ఆటలు ఆడని ప్లేయర్? సీడీ ప్లేయర్! |
తాజ్ మహల్ ఎక్కడ ఉంది? కట్టిన చోటే! |
జర్నలిస్టుకి దేవుడు ప్రత్యక్షం అయితే.....? ఇంటర్వ్యూ చేస్తాడు!! |
జూ అధికారి నూతన దంపతులను ఎలా ఆశీర్వదిస్తాడు? "చిలకా గోరింకల్లా " వుండండి!! |
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్క లాడింది, ఏమిటది?కవ్వం! |
కాగితాలు చింపుతాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కాని బిచ్చగాడు కాదు.. ఎవరతను? కండక్టర్ |
గొడుగు కాని గొడుగు? పుట్టగొడుగు |
కాయ కాని కాయ? మెడకాయ |
మందు కాని మందు? కామందు |
గ్రహం కాని గ్రహం? అనుగ్రహం |
మే నెలలో పుట్టిన నత్త ? జవాబు: మేనత్త! |
దుర్గకి పట్టిన గతి ? జవాబు: దుర్గతి! |
కోడి కాని కోడి ? జవాబు: పకోడీ! |
పండు కాని పండు ? జవాబు: విభూది పండు! |
పురం గాని పురం? జవాబు: కాపురం! |
తాళి కాని తాళి ? జవాబు: ఎగతాళి |
తార కాని తార? జవాబు: సితార |
పాలు కాని పాలు? జవాబు: కోపాలు |
కాయ గాని కాయ ?జవాబు: తలకాయ! |
సందు కాని సందు? జవాబు: పసందు |
పతి కాని పతి? జవాబు: తిరుపతి |
కారు గాని కారు? జవాబు: షావుకారు |
హారం గాని హారం? జవాబు: ఫలహారం! |
మాట కాని మాట? జవాబు: టమాట |
దానం గాని దానం? జవాబు: మైదానం! |
దారా కాని దార? జవాబు: పంచదార |
శిక్ష గాని శిక్ష? జవాబు: బాల శిక్ష |
తాళం కాని తాళం? జవాబు: పాతాళం |
మామ గాని మామ? జవాబు: చందమామ! |
జనము కాని జనము? జవాబు: భోజనము |
వరం కాని వరం? జవాబు: కలవరం |
రెంటు గాని రెంటు?జవాబు: కరెంటు. |
రాణి కాని రాణి? జవాబు: పారాణి |
కులం కానీ కులం? జవాబు: గురుకులం |
రసం గాని రసం? జవాబు: నీరసం |
దారం గాని దారం? జవాబు: మందారం |
తారు కాని తారు? జవాబు: జలతారు |
మత్తు కాని మత్తు? జవాబు: గమ్మత్తు |
కట్టు గాని కట్టు ? జవాబు: తాకట్టు |
గోళం కాని గోళం? జవాబు: గందరగోళం |
హారం కాని హారం? జవాబు: వ్యవహారం |
రాగి కాని రాగి? జవాబు: బైరాగి |
కారం కాని కారం? జవాబు: ఉపకారం |
మొగ్గ కాని మొగ్గ? జవాబు: పిల్లి మొగ్గ |
టూరు గాని టూరు? జవాబు: గుంటూరు |
బడి కాని బడి? జవాబు: రాబడి |
రాజు గాని రాజు? జవాబు: తరాజు |
రాయి కాని రాయి? జవాబు: కిరాయి |
దేహం గాని దేహం? జవాబు: సందేహం |
దారి కాని దారి? జవాబు: గోదారి |
దేశం గాని దేశం?జవాబు: సందేశం |
నాడ కాని నాడ? జవాబు: కాకినాడ |
కీలు కాని కీలు? జవాబు: వకీలు |
వెల కాని వెల? జవాబు: కోవెల |