ఫోటో తీసేటప్పుడు ఏం చేశారు?
స్కూల్ పిల్లలను ఫీల్డ్ స్టడీ కోసం పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారు టీచర్లు....
ఇన్ స్పెక్టర్ ఏకలింగం పిల్లలకు పోలీస్ స్టేషన్ విశేషాలను వివరించసాగాడు.
పోలీస్ స్టేషన్ ఆవరణ లోని నోటిస్ బోర్డు లో నేరస్తుల ఫోటోలు చూపిస్తూ ...
వీళ్లంతా 'మోస్ట్ వాంటెడ్' నేరస్తులు చెప్పాడు.
పిల్లల్లో చింటూకి ఓ అనుమానం వచ్చి ఇన్ స్పెక్టర్ ను ఇలా అడిగాడు.
'అంత పెద్ద నేరస్తులైనప్పుడు ఫోటోలు తీసేటప్పుడు వాళ్లను పట్టుకోలేకపోయారా?'