('జీవనతరంగాలు' చిత్రంలోని 'ఈ జీవన తరంగాలలో......... ' పాటకు)
ఈ చదువుల తరంగాలలో ఆ టీచరు ప్రసంగాలలో
ఏదో ఉన్నది లోపము - ఎంత వరకీ శాపమూ -
బుక్కు పట్టుకు చెప్పేదొకరు - సొంత గొప్పలు విప్పేదొకరు
తలకు నొప్పి తెచ్చేదొకరు - ఆ పై నిన్ను చంపేదొకరు //ఈ చదువుల//
చదువే మనకు బందిఖానా - భయపడి ఇంట్లో ఉండిపోయినా
టెస్టుల సమయం వెంటబడి - బుక్కు పట్టుకోమంటుంది
నీ జయం తెల్చోకోమంటుంది //ఈ చదువుల//
పాఠం చెప్పే సార్లు లేరని - చివర వచ్చే టెస్టు లాపరు
బెంచికి బెంచికి ఎడం తప్పదు - అయినా కాపీయింగు లాగవు
ఈ టెస్టులు నీ భవితను మార్చక మానవు //ఈ చదువుల//