("శంకరా భరణం " చిత్రంలోని "శంకరా ........ నాదశరీరాపరా " పాటకు)
నమ్మరా! మందు శరీరా! ఓరే!
బారు విహారా... !ఒరే బిరేశ్వరా... !!
ప్రాణము నీవని, పానమే నీవని
తాగుడే ధ్యానమనీ..
మందు విచక్షణ, 'పాన' వలక్షణ రోగమే రాగమని.......
మందో పాసన చేసిన వాడను నీ.... వాడను నేనైతే........
'విస్కీ' రీంద్రజిత హిమబీరేంద్ర -
సిత మందురా ........ భలే పసందురా //నమ్మరా//
కలిసే మనసుల మురిసే వయసుల
నురగల బుస బుస కాబోలు
పగిలే గ్లాసులు రగిలే మనషుల
గడసరి గుటకలు కాబోలు ........
మత్తులోన పడి శిరనూగంగా
ధరకు జారెనా పరువంతా .........
నా పానలహరి నువు మునుగంగ
ఆనంద బ్రాందిలో నే తడవంగా ........
ఆ......... ఆ ......... ఆ //నమ్మరా//