Social Icons

Pages

Jokes in Telugu - Telugu Peradi Song # 2

"అందమైన అనుభవం" చిత్రంలోని "కుర్రాళ్లోయ్........ కుర్రాళ్లు ........" పాటకు

పిల్లాళ్లోయ్........ పిల్లాళ్లు....... పిచ్చెక్కీ ఉన్నోళ్లు
కళ్ళల్లో పడనోళ్లు.... వంచిచే కేడిలూ.....
కేటుగాళ్లు పోటుగాళ్లు వెన్నంటే వేటగాళ్లు
భయమంటూ లేనివాళ్లు జల్సాలు మరిగినోళ్లు
రా......... రా......... రీ ........ ఓ

తాళులు తెంపేది వీళ్లు........ బ్యాగులు లాగేది వీళ్లు
బ్యాంకులు దోచేది వీళ్లు ....... బైకుల్లో తిరిగేది వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి పోకిరోళ్ళు.......
పాలబుగ్గల చిన్నోళ్లు......... పోలిసోళ్ళకు సవాళ్లు
కన్నవారికి కన్నీళ్లు ......... చేతికెపుడూ సంకెళ్లు......

ఒంటిగా తిరిగేటి ఆడోళ్లు ...... ఊరి చివరన లోగిళ్లు
ఊరి గుడిలో దేవుళ్లు ..... అర్ధరాత్రిలో అంగళ్లు
అన్నీనోయ్ వీరి టార్గెట్లు ......
పగలు ఎపుడూ రెక్కీలు ..... తలలకెపుడూ హెల్మెట్లు
తాళమేసిన వాకిళ్లు ......... కంటపడితే దోపిళ్ళు.......

 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express