(సారంగధర చిత్రంలోని 'అన్నానా......... భామిని' పాటకు)
తిన్నానా........ తీపిని - ఎంతని?
ఎప్పుడైనా ........ తిన్నానా? - ఎంతని?
కరకరమను అరిసెలలో
'కేలరీలు' మెరిసేనని
పంటి కొసన ఎప్పుడైనా
కొరికానా..... అరిసెను......... ఎపుడైనా!
తాకానా ......... బాదుషా........ ముక్కైనా
ఎపుడైనా ........ తాకానా బాదుషా ముక్కైనా !
షుగరొచ్చిన నాటి నుండి
కడుపు మాడ్చుకున్నానని
ఆదమరచి ఎపుడైనా తిన్నానా
బాదుషా... ఎపుడైనా!
రోగాలకు రాజు అయిన
మధుమేహపు దాసుడనని - ఆహా
బాధపడుతూ ఎపుడైనా అన్నానా ........
నోటితో........ ఎపుడైనా!
'డైటు' నమ్ముకున్నానని
'వెయిటే' నా దెయ్యమని
మాత్ర మరచి ఎపుడైనా
ఉన్నానా......... మధుమేహాన ....... ఎపుడైనా ........