Telugu Cartoon Jokes
ప్రకటన “మా స్వీట్ షాపులో పనిచేయడా నికి ఔత్సాహిక యువతీ యువకుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అర్హత: అభ్యర్థులు కచ్చితంగా మధు మేహ వ్యాధిగ్రస్తులై ఉండవలెను" |
అదే హాయి! “మీ టీవీ బాగుచెయ్యడానికి వెయ్యిరూపాయలు అవుతుంది. మాస్టారూ.." చెప్పాడు మెకానిక్. "రెండు వేలిస్తాను - నెలవరకు బాగవదని మా ఆవిడకి చెప్పగలవా" బతిమాలాడు శంభులింగం. |
ఔరా! పోలీసు అవాక్కయ్యేదెప్పుడు? “పట్టపగలు దొంగతనమా ..." అంటే, “నాకు రేచీకటి... రాత్రులు కుదరదు" అని దొంగ బదులిచ్చినప్పుడు! |
మొదటి మెట్టు సుబ్బారావు : దెబ్బలేమైనా తగిలాయా? మన్మథరావు: ఎలాంటి దెబ్బలు తగల్లేదు! సుబ్బారావు: అదెలా? మన్మథరావు: నిచ్చెన మొదటి మెట్టు మీద ఉండగానే జారిపడ్డాను. |
క్రెడిట్ కార్డు |
అవాక్కు ఆ స్కూల్లో టీచర్ గా ఆమె కొత్తగా చేరింది. మొదటి సారి క్లాస్ తీసుకుంటోంది. సరదాగా విద్యార్థినీ విద్యార్ధు లను పరిచయం చేసుకోదలచి, వారి పేర్లూ, హాబీలూ తెలుసు కుంటోంది. ముందుగా ముగ్గురు అబ్బాయిలు, తమ పేర్లూ, హాబీలూ చెప్పసాగారిలా. మొదటి అబ్బాయి: నా పేరు రాజండి! నాకు ప్రకృతిని చూడడం అంటే చాలా ఇష్టం. . రెండో అబ్బాయి: నా పేరు ప్రసాదండి! నాకు కూడా ప్రకృతి అంటే ప్రాణం. మూడో అబ్బాయి: నా పేరు శీనండి! నేను కూడా ప్రకృ తిని చూసి మురిసిపోతానండి. టీచర్: గుడ్! ప్రకృతిపట్ల మీకున్న అభిమానాన్ని చూస్తోంటే ముచ్చటవేస్తోంది. అమ్మాయిలు ముగ్గురు మాట్లా డాక, మళ్ళీ అబ్బాయిల దగ్గరకు వస్తాను. ముందు నువ్వు చెప్పమ్మా! నీ పేరేమిటి? అమ్మాయి: నా పేరు ప్రకృతి అండి! టీచర్ అవాక్కయింది. |
పరిగెడుతోంది... నరసయ్య : మరేం లేదు... అందరూ కాలం పరిగెడుతోందంటారు కదా. తనేమో కాలాన్ని ఎగరేస్తానని నాతో పందెం కాశాడు. |
ఎందుకండీ! భార్య: ఏమండీ! ఈ వారమంతా షాపింగ్ చేద్దామా? భర్త: సరే! కానీ నీఇష్టం. అయితే వచ్చే వారం గుళ్లకు వెళ్తామా? భార్య: ఎందుకండీ? భర్త: అడుక్కోవడానికి!!!! |
కాలం
అప్పారావు: ఇక్కడ ఇలా కూర్చొని కూర్చొని పగ సాధిస్తున్నాను.
వెంగళప్ప: అదెలా? అయినా, ఎవరి మీద పగ?!
అప్పారావు:ఒకప్పుడు కాలం నా జీవితాన్ని నాశనం చేసింది. నేనిప్పుడు కాలాన్ని నాశనం చేస్తున్నా.
|
వింతగా ఉందే!
చింటూ: నీ చెప్పుల జత ఇంతగా ఉందేంటి. ఒకటి ఎరుపు మరోటి పచ్చ రంగు.
బంటి: అవును ........ ఇలాంటి జతే మరోటి మా ఇంట్లో ఉంది తెలుసా.
|
అసలు వినిపించటం లేదా?
పేషేంట్: డాక్టర్! నాకీ మధ్య అస్సలు వినిపించటం లేదు.
డాక్టర్: ఏంటీ ...... ఫీజు తేలేదా? ఫీజు ఇవ్వకపోతే నేనొప్పుకోను.
|
ఏమో!
చంటి: నేను బ్రహ్మాండముగా పరుగెత్తుతానురా!భవిష్యత్తులో నేను ఖచ్చితంగా పోలీసవుతానేమో!
రాజు : ఏమో! దొంగవి కూడా కావచ్చు కదా!
|
అదెలా? (భార్య భర్తతో ఇలా అంటున్నది)
కాంతమ్మ: "మన కుటుంబ విషయాలు బయటకు తెలియకుండా ఉండేది మీ చేతుల్లోనే ఉంది!"
సుబ్బారావు: "అదెలా? నేనేం చేయగలను... ?
కాంతమ్మ; నేను కోపంతో తిట్టినా.... కొట్టినా మీరు అరవకూడదు. సరేనా....? సుబ్బారావు:ఆఆ ..... |
తింగరి వేషాలు (స్కూటర్ మీద ఉన్న భర్త ను చూసి భార్య ఇలా అంటున్న సందర్భంలోనిది)
మీరిలాంటి తింగరి వేషాలు వేస్తారనే హెల్మెట్ వెనకాల కెమెరా పెట్టాను!! .......
|
ఖగోళంలో అందాల కనువిందు |
సైన్స్ విద్యార్థుల తిట్ల పురాణం
(ఇద్దరు సైన్స్ విద్యార్థులు ఇలా తిట్టుకుంటున్నారు)
పోరా "పొటాషియం".... !!...
పోరా "మెగ్నీషియం".... !!...
|
క్రికెట్ భాష
(తండ్రి తన కొడుకు మార్కుల గురించి అడుగుతుంటే కొడుకు చెప్పే సమాధానం)
లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయంటే ........
"క్రికెట్" భాషలో మన కొడుకు చెపుతున్నాడండీ!!....
|
వాట్సాప్ మెసేజ్ (భర్త భార్యతో ఇలా అంటున్నాడు)
బయట బోర్డు పైన నా ఫోన్ నంబర్ రాయించవద్దంటే విన్నావా, "మీ వాకిట్లో నిలబడ్డాను ధర్మం చేయండమ్మా....! అని ఎవడో వాట్సాప్ చేసాడు చూడు....
|
యోగ, యోగం
యోగ, యోగం ఈ రెండింటిలో ఏది అమోఘం స్వామీ అని ఓ భక్తుడు అడిగాడు.
స్వామిజీ: మీరు కామ్ గా వుంటే అది యోగ
మీ ఆవిడ కామ్ గా ఉంటే అది యోగం
ఇద్దరూ కామ్ గా ఉంటే అది అమోఘం
ఆ ఇల్లు వైభోగం.........
|
సందేహం ఎందుకు నాయన!
స్వామిజీ: తనకు దగ్గరగా వెళ్తున్న ఓ తాగుబోతును ఆపి........ "అలా తాగకు నాయనా..... నీవు చనిపోయాక నరకానికి పోతావ్" అని అన్నాడు.
తాగుబోతు: నా సంగతి సరే.... మరి నాకు మందు అమ్మేవాడు?
స్వామిజీ: అతను కూడా నరకానికే నాయనా.
తాగుబోతు: మరి మందుషాపు ముందు చికెన్, ఇతరత్రా తినుబండారాలు అమ్మేవాడు?
స్వామిజీ: ఇందులో సందేహం ఎందుకు నాయనా అతను కూడా నరకానికే పోతాడు!
|
సోషల్ ట్రెండ్
'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కానీ గుర్తుకు రావట్లేదు. పేస్ బుక్ లో ఉన్నారా?'
"లేను........ "
|
నిండు నూరేళ్లు |
స్విచ్ ఆఫ్
సూర్య : నాన్నా! అన్నయ్యకు నా ఫోన్ నుంచి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది.....
రంగారావు: అయితే అమ్మ ఫోన్ నుంచి చెయ్యి!
|
వెంగళప్ప జోక్
వెంగళప్ప: ఇంట్లో ఉన్న పప్పులన్నీ పారబోసెయ్యి....
కాంతం : ఎందుకు?
వెంగళప్ప : ఇందాక మన పక్కింటాయన నీ పప్పులేమీ ఉడకవ్ అన్నాడు!
|
ఎలా పనిచేస్తోంది
సూర్య : మీ కొత్త ఫ్రిజ్ ఎలా పనిచేస్తోంది.....
కిరణ్ : కరెంటుతోనేనండి !
|
స్పీకింగ్ ఇంగ్లిష్
అజిత్ భార్య విమల ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో చేరింది (కొద్ది రోజుల తర్వాత......... )
విమల : వెల్కమ్ హోమ్ డార్లింగ్....... !
అజిత్: ఐ యామ్ సో టైర్డ్ టుడే
విమల: ఓకే ......... రెస్ట్ ఇన్ పీస్!!!
|
ఎక్కడికి వెళ్తున్నారు?
భార్య: ఈ మిట్ట మధ్యాహ్నం లో ఎక్కడికి వెళ్తున్నారు?
భర్త: టెర్రస్ మీదకి వెళ్లి పిట్టలకు నీళ్లు పెట్టి వస్తాను.
భార్య: అక్కరలేదు, కిందకు దిగి రండి మీ అన్ని పిట్టలు పుట్టింటికి వెళ్లాయి.
|
డ్యూయల్ సిమ్
సుమ: నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావ్?
నవీన్: నేను మొబైలైతే నువ్వు సిమ్ కార్డ్.
సుమ: ఓ ...... నేనెంతో లక్కీ.
నవీన్: ఇంకా నయం...... నాది డ్యూయల్ సిమ్ మొబైల్ అని తనకు తెలియదు!!
|
షుగర్ లేదుగా!
సురేశ్ : ఎక్కడ చూసినా మోసమే! చాలా కోపంగా ఉంది.
రమేశ్ : ఏమైందిరా?
సురేశ్ : స్వీట్ పాకెట్ కొని ఇంటికి తీసుకొచ్చా. దానిపై షుగర్ ఫ్రీ అని రాసి ఉంది. ఇంటికెళ్లి ప్యాకెట్ తెరచి చూస్తే అందులో షుగర్ లేదురా!
రమేశ్ : ఆఆఆ!
|
చివరి కోరిక
జైలర్ :నీకు రేపే ఉరిశిక్షను అమలు చేస్తున్నాం. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు
ఖైదీ: అయితే నన్ను తలకిందులుగా ఉరితీయండి!!
|
బ్రేకప్ చెప్పేస్తా!
ప్రసాద్: అబ్బా ........ నా గర్ల్ ఫ్రెండ్ మేకప్ కు అయ్యే ఖర్చు భరించలేకపోతున్నా. వెంటనే బ్రేకప్ చెప్పేస్తా!
సురేశ్ : చూడు ప్రసాద్! అనుభవంతో చెబుతున్నా ........ మేకప్ లేకుండా భరించడం ఇంకా కష్టం ........ ఆలోచించుకో!
|
ఇంపాజిబుల్
సోము: 'ఇంపాజిబుల్' అన్న పదం నా డిక్షనరీలోనే లేదు!
సత్యం: ఇప్పుడనుకుని ఏం లాభంరా ..... డిక్షనరీ కొనేటప్పుడే చూసుకోవాలి........ అన్ని పదాలు ఉన్నాయో లేదో!
|
జీవిత సత్యం!
పెళ్లికాక ముందు ప్రేయసి పక్కన కూర్చొని చెరువులో రాళ్లేస్తూ మాట్లాడేవాడు
ఆ పిల్లనే పెళ్లిచేసుకున్నాక ఇప్పుడు బియ్యంలో రాళ్లు ఏరుతూ వాడిలో వాడే ఇలా మాట్లాడుకుంటున్నాడు.
వాడికి రాళ్లకి ఏంటో ఆ అవినాభావ సంబంధం. మళ్లీ వాడి దగ్గరికే తిరిగొచ్చేశాయ్.
|
థాంక్యూ డార్లింగ్!
భర్త: డార్లింగ్ ఇవాళ మనం భోజనం బయట చేద్దాం
భార్య : ఓహ్ ........ థాంక్యూ డార్లింగ్. చిటికెలో తయారై వస్తాను.
భర్త: నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు తీసుకొని వచ్చెయ్.
|
ప్రేమించడం లేదుగా!
భార్య: పెళ్లి తర్వాత అసలు నన్ను ప్రేమించడం లేదుగా??
భర్త: పరీక్ష రాసిన తర్వాత కూడా ఎవరైనా చదువుతారా...........
|
హచ్ కుక్క
డాక్టర్ : కుక్క వెంట పడుతుంటే తప్పించుకోకుండా ఏమి చేస్తున్నావ్?
సోము: 'హచ్' కుక్కేమో అనుకున్నా డాక్టర్. కరిచాక తెలిసింది అది పిచ్చికుక్కని!
|
మౌనవ్రతం
రాము : రోజూ పిల్లిలా ఉండే మీ నాన్న ఈ రోజు మాత్రం ఎందుకలా అరుస్తున్నాడు?
సోము: ఇవాళ మా అమ్మ మౌనవ్రతం. అందుకే మా నాన్న రెచ్చిపోతున్నాడు.
రాము: !!!!!
|
ఓ కాకి ఫీలింగ్
"వీళ్లెక్కడి మనుష్యులురా బాబూ...... అన్నానికి వస్తే పాడు కాకి అని తరుముతారు ..... పిండానికి రాకపోతే బతిమిలాడతారు."
|
స్టేటస్ కోమా
ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన సుబ్బారావు, ఒక అమ్మాయి పెట్టిన పోస్టు చదివి ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.........
"నాకు మగాళ్లంటే అసహ్యం. అందుకే ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను, నా పిల్లల్ని కూడా చేసుకోనివ్వను".
|
అప్పడే ప్రసవమై మెలుకువ వచ్చిందామెకు. పక్కన తడిమి చూసుకుంది. ఆదుర్ధా పడింది.
బాలింత బాధ అర్థం చేసుకున్న నర్స్ "ఇదుగోండి మీ పాప .........మనసారా చూసుకోండి" చేతికందిస్తూ నవ్వింది.
"నేను వెతుకుతోంది ......... నా మొబైల్ ఫోన్" చెప్పింది బాలింతరాలు.
|
సరికి సరి
"మా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచాం. తనకి వంట చేయడం రాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బావగారూ ........" వియ్యంకుడి చేతులు పట్టుకున్నాడు కుటుంబరావు.
"అయ్యో ....... ఎంత మాట బావగారూ ...... తప్పకుండా. అన్నట్టు మా అబ్బాయిని కూడా అల్లారుముద్దుగా పెంచాం. సంపాదించడం రాదు. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అని బదులిచ్చాడు జగన్నాథం.
|
వద్దన్నా వస్తారు
"స్వామీ నేను పోయిన తర్వాత నా సమాధి చుట్టూతా జనాలు గుమిగూడాలంటే ఏం చేయాలి......." అడిగాడు జగన్నాథం.
"ఏముంది నాయనా ....... నీ సమాధి దగ్గర ఫ్రీ వైఫై సౌకర్యం కలిగిస్తే చాలు. రాత్రింబవళ్లూ నీ సమాధి చుట్టే ఉంటారు" అని సెలవిచ్చాడు స్వామిజీ.
|
భర్త : మన అమ్మాయిని మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి చేయాలి!
భార్య : మంచి ఆలోచన. మా నాన్నలా తొందరపడకుండా!
|
గోవిందం : మీ వాడికి చదువుకన్నా సంగీతాన్నే ఎక్కువగా నేర్పిస్తున్నావేం?
వెంగళప్ప : చదువు చాలా కష్టం. సంగీతం 7 అక్షరాలు నేర్చుకుంటే చాలని!
|
భార్య: "ఏమండీ ఇంటర్నెట్ లో ఏమైనా డౌన్ లోడ్ చేయవచ్చునని చెప్పారు కదా"
భర్త : "అవును... నిజమే. ఇప్పుడేమైనా నేను కాదన్నానా చెప్పు"
భార్య: "అయితే త్వరగా ముగ్గుల మీద పెట్టడానికి నాలుగు గొబ్బెమ్మలు డౌన్ లోడ్ చేయండి"
|
భర్త : ఎందుకే అంత ఖంగారు నేను ముగ్గులేస్తాను
భార్య : ఆఫీస్ లో సంతాకాలు పెట్టినట్లు ముగ్గులు పెట్టావో తాటతీస్తా
|
భర్త: "ఏంటే.... ముగ్గుల మీద పెట్టాల్సిన గొబ్బెమ్మలను ప్లేట్ లో పెడుతున్నావ్" నీ మతిమరుపు పాడుగానూ
భార్య: "మీరు అనుకున్నట్టు అవి గొబ్బెమ్మలు కాదండీ....... మీ కోసం పొద్దున్నే లేచి వేడివేడిగా వేసిన గారెలు" కాస్త మాడిపోయాయి అంతే
|
భార్య : ముగ్గులేస్తావా.... లేక బావిలో దూకమంటావా.
భర్త : నాకు ముగ్గులు వేయడం రాదే...... నమ్ము నమ్మవే!
భార్య : నాకదంతా తెలీదు. వేస్తావా లేదా...... అది చెప్పు.
భర్త : ఏదోలా వేసి చస్తా...... ముందు అక్కడి నుంచి దిగవే.
|
సుధాకర్ : మీ ఇంట్లో దొంగలు పడబోతున్నారని చెబుతున్నావ్. మరి పోలిస్ ఫిర్యాదు ఇవ్వకపోయావా"
సురేందర్ : "వద్దురా బాగోదు. అయినా కొత్త అల్లుడు, మిగతా ఇద్దరు అల్లుళ్ల మీద పోలిస్ ఫిర్యాదు ఇస్తే ఏం బాగుంటుంది.
|
మామ: చిన్నల్లుడు నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పా........ పండక్కి రావద్దని!
అల్లుడు: ఇలా జరుగుతుందని నేను కలగన్నానా....... మీ అమ్మాయే........ మా ఇంట్లో పండగ బాగా జరుగుతుంది అంటే వచ్చాను.
మామ : అలా వచ్చావ్ ఇలా ఇరుక్కు పోయావ్...... తొందరగా కానీ
|
ముకుందం : నా జీవితంలో ఆసుపత్రికి రావడం ఇదే మొదటిసారి. నర్స్ : చివరిసారి కూడా ఇదే కావచ్చు! |
నాన్న: వచ్చీ రావడంతోనే అల్లుడు గారు ఎటెళ్ళారమ్మా? కూతురు : వచ్చే పండక్కి రిజర్వేషన్ చేయడానికి! |
గోపి : మా ఆవిడ కంటే నాదే పైచేయి..... కృష్ణ :ఏ విషయంలో .......... గోపి : అటక మీదున్నవి అందుకోవడానికి! |
రాము : మీ యజమాని లంచం తీసుకుంటాడని ఇలా చీటిపై రాసి చూపుతున్నావెందుకు? వెంగళప్ప : ఈ విషయం ఎవరితో చెప్పొద్దన్నాడు! |
రవి : పాత బాకీ నాకు మండేలోగా ఇచ్చేయ్........ వెంగళప్ప : మండకముందే తీర్చేస్తాలే! |
సుజాత : గిన్నెడు నూనె నేలపాలైనా సంతోషంగా ఉన్నావేం? గిరిజ : ఆ నూనెలో పక్కింటావిడ జారిపడిందిలే! |
అప్పారావు : ఆ డాక్టర్ మనిషిని చూడకుండానే రోగమేంటో చెప్పగలడు.......... సుబ్బారావు : ఎలా? అప్పారావు : నోటితో! |
భార్య : నా ఫోటోని మీ పర్స్ లో ఎందుకు పెట్టుకున్నారు? భర్త : ఏదైనా సమస్య వస్తే చూసుకుందామని............ భార్య : ఫోటో చూస్తే మీ సమస్య తీరిపోతుందా ? భర్త : తీరదు. నీ కంటే పెద్ద సమస్య ఉండదని ధైర్యం తెచ్చుకుందామని! |
దొంగ : నీ పర్స్ ఇవ్వు. లేకపోతే ఈ తుపాకీతో కాల్చి చంపేస్తా........... సుబ్బారావు: ఇదిగో తీసుకో.......... దొంగ: పిచ్చివాడా! ఈ తుపాకీలో గుళ్లు లేవు........ సుబ్బారావు: వెర్రివాడా! ఆ పర్స్ లో కూడా డబ్బుల్లేవ్! |
ధర్మారావు: ఈ రోజే చెవిటి మిషన్ కొన్నా............ రాజారావు: మరి ఇప్పుడు బాగా వినిపిస్తోందా? ధర్మారావు: ధరా! వెయ్యి రూపాయలు |
పంకజం : ఏం వదినా! ఈ రోజు కూరగాయలు కడక్కుండానే వంట చేస్తున్నారు? తాయారు : నేను ఉపవాసం. వంట ఆయనకొక్కడికే! |
పోస్ట్ మ్యాన్ : గోవిందం గారిల్లు కావాలండీ............. హరి : ఆయన ఎవరికీ ఇవ్వరండి! |
హరి : నిన్న రాత్రి పది మంది రౌడీలు నాపై దాడి చేస్తే అందర్ని తన్ని పంపించా తెలుసా? గిరి : అలాగా! ఇంతకీ ఎక్కడ? హరి : కలలో! |
హరి : ఇన్నేళ్లయింది, నా అప్పు తీర్చవా? గిరి : అప్పుడే చెప్పాగా ............ హరి : ఏమని? గిరి : మీ ఋణం జన్మలో తీర్చుకోలేనని! |
రంగారావు : బేరర్! ఈ టిఫిన్ లో సిగరెట్ ఉంది........... బేరర్ : సారీ సార్! మా దగ్గర అగ్గిపెట్టె లేదు. |
హరి : నా కుక్క రెండు రోజులుగా కనిపించడం లేదు. గిరి : అయితే పత్రికలో ప్రకటన ఇవ్వకపోయావా? హరి : దానికి చదవటం రాదుగా! |
భార్య : షాజహాన్ భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు. మరి నువ్వు? భర్త : నేనూ కడుతూనే ఉన్నాను కదా నువ్వు కొన్న వస్తువులకు వాయిదాలు! |
టీచర్ : రమ్యా! మతిమరుపుకి, జ్ఞాపక శక్తికి తేడా చెప్పు? రమ్యా : మనకు ఇవ్వాల్సినవి గుర్తుపెట్టుకోవడం జ్ఞాపకశక్తి, మనం ఇవ్వాల్సినవి మరచిపోవడం మతిమరుపు. |
భార్య : బయట ఎండా లేదు, వానా లేదు మరి ఆ గొడుగెందుకు? భర్త : అప్పులు ఉన్నాయిగా! |
హరి : వేగంగా వెళ్లే బైక్ చూపించు? షాపువాడు : ఇదిగోండి సార్! పొద్దున మీరు ఇదింటికి ఎక్కితే పది నిముషాల్లో ఆఫీసులో ఉంటారు! హరి : అయితే ఇది నా కొద్దు. అంత పొద్దున ఆఫీసులో నాకేం పని! |
పనివాడు : అయ్యా, ముగ్గురి పనిని నేనొక్కడినే చేస్తున్నా. కాస్త జీతం పెంచండి............ యజమాని : పని ఎగ్గొట్టి ఆ ఇద్దరు ఎటు వెళ్లారు? |
సర్వర్ : సర్! పిజ్జా ఎన్ని ముక్కలు చేయాలి. ఆరా, పన్నెండా? అమాయక చక్రవర్తి : పన్నెండు నేను తినలేను, ఆరే చెయ్యి! |
హరి : దొంగ దొరికాడా? అమాయక చక్రవర్తి : లేదు కానీ వేలిముద్రలు సంపాదించా......... హరి : ఎక్కడ? అమాయక చక్రవర్తి : నా చెంప మీద! |
హరి : డిక్షనరీ పట్టుకొని ట్యూషన్ వెళుతున్నావా? గిరి : కాదు! ఇంగ్లిష్ సినిమాకి! |
హరి : డాక్టర్ నాకు కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, అంతా చీకటిగా అనిపిస్తోంది. మంచి మందులివ్వండి............. డాక్టర్ : దీనికి మందులు అక్కరలేదు, బార్బర్ కొట్టు కెళ్ళి వేలాడుతున్న ఆ జుట్టు కత్తిరించుకో! |
నాన్న : బొట్టు బొట్టూ కలిస్తేనే సముద్రం అవుతుంది. చింటు: రెండు బొట్లు అవుతాయి కానీ సముద్రం ఎలా అవుతుంది? |
కండక్టర్: ఎక్కడికి వెళ్లాలి? గోపి : దోసపాడు! కండక్టర్: ఇది ఎక్స్ ప్రెస్, అన్ని చోట్లా ఆగదు! గోపి : అన్నిచోట్లా అక్కర్లేదు! నేను చెప్పిన చోట ఆపితే చాలు! |
టీచర్ : ఒరేయ్ చంటి నీకొచ్చింది ఐదు(5) మార్కులు. సిగ్గులేకుండా ఇంకా నవ్వుతున్నావా? చంటి : ఆ ఐదు మార్కులు కూడా ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు టీచర్. నేను రాసింది గబ్బర్ సింగ్ లోని పాట కదా! |
టీచర్ : (అప్పారావు తో) మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. అతని రిపోర్ట్ కార్డ్ చూడండి........ ఇంగ్లిష్ - 20, మాథ్స్ - 15, హిందీ - 18, ఫిజిక్స్ - 13, కెమిస్ట్రీ - 15, సైన్స్ - 17, టోటల్ - 98 అప్పారావు : అరే టోటల్ లో మావాడు భలే అదరగొట్టేశాడు కదా. ఇంతకీ ఆ సబ్జెక్ట్(టోటల్) చెప్పే టీచర్ ఎవరు? |
సంధ్య :"మా అమ్మాయిని కొట్టకండి టీచర్ జ్వరమొస్తుంది" టీచర్ : అదేలా, అల్లరి చేస్తే తప్పదు మరి సంధ్య : "అప్పుడు పక్క అమ్మాయిని కొట్టండి. మా అమ్మాయి వెంటనే అల్లరి మానేస్తుంది"! |
గోపి : నేను ఒక కవిత చెప్పనా? హరి : చెప్పు మరి! గోపి : శ్రీరామ రక్ష - రేపే పరీక్ష పూనాను దీక్ష - పాసయితే లక్ష ఫేలయితే రిక్షా - అదే నాకు శిక్ష! |
అప్పారావు : "మన ఊరి ఆస్పత్రి లో మెదడువాపు వ్యాధి రాకుండా బిళ్లలిస్తున్నారట". అన్నాడు భార్యతో చింతామణి: "అవి మెదడున్నోళ్ళకేమోనండి ...... " వెనక నుండి అరచింది భార్య. |
అప్పారావు : "ఏంటయ్యా సర్వరూ ......... అన్నం ఇంత నల్లగా తగలడ్డదేం? సర్వరు : " మా యజమాని బియ్యాన్ని బ్లాక్ లో కొన్నారటండి! |
చంటి : "మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి, సాయంత్రం నాన్నమ్మ ఇంటికి భోజనానికి వెళ్తున్నావెందుకురా?" బంటి : "మా అమ్మానాన్న పోట్లాడుకొని వాళ్ల వాళ్ల పుట్టిల్లకు వెళ్ళారు". అందుకే నాకీ తిప్పలు! |
నాన్న : చింటూ! ఎందుకు ఏడుస్తున్నావ్? చింటూ : అమ్మ నిన్న కొట్టింది! నాన్న : మరి ఈ రోజు ఏడుస్తున్నావేం? చింటూ : నిన్న మీరు లేరుగా! |
టీచర్ : రాము! వాయిదా వేయడమంటే ఏమిటో చెప్పు? రాము : జవాబు రేపు చెబుతాను టీచర్! |
రోగి : అదేంటి! ఆపరేషన్ చేయకుండా పరికరాలన్నిటింకీ అలా పసుపు, కుంకుమ రాస్తున్నారు? నర్స్ : ఇది మా డాక్టరు గారి మొదటి ఆపరేషన్. |
అప్పారావు : పండగ పూట మీ ఇంట్లో దోపిడి జరిగిందా? మరి పోలీసులకు పిర్యాదు చేయలేదా? సుబ్బారావు : అల్లుళ్ళ మీద పిర్యాదు చేస్తే ఏం బావుంటుంది? ! |
గోపి : నీకు పుస్తకాలంటే చాలా ఇష్టమా? కృష్ణ : నాకు చాలా ఇష్టమైనది ఒకే ఒక పుస్తకం .... గోపి : ఏంటది? కృష్ణ : మా నాన్న చెక్ బుక్! |
గోపి : నిద్ర లేచిన వెంటనే ఎవరి ముఖం చూస్తావ్? కృష్ణ : ఆఫీస్ లోనా, ఇంట్లో నా? |
గోపి : మీ నాన్న గారి రచనల్లో మీకు బాగా నచ్చినది ఏది? కృష్ణ : ఆయన రాసిన వీలునామా! |
కస్టమర్ : నేను ఒక కాఫీకి, ఒక టీకి ఆర్డర్ ఇస్తే కాఫీనే తెచ్చావ్? సర్వర్ : కాఫీ ఒకటీ అన్నారు కదా! |
హరి : నేను ఏ విషయాన్నైనా గంటల తరబడి మాట్లాడుతా తెలుసా? గిరి : అంతేనా! నేను ఏమీ లేకపోయినా రోజుల తరబడి మాట్లాడగలను! |
డాక్టర్ : నీ ఆరోగ్యం బాగు పడాలంటే రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి! గిరి: రోజూ క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతున్నా డాక్టర్ ! డాక్టర్ : మంచిది! ఎక్కడ ఆడుతున్నారు? గిరి : సెల్ ఫోన్ లో ..... |
టీచర్ : హరి ! వారానికి ఎన్ని రోజులు? హరి : ఆరు రోజులు టీచర్. టీచర్ : అదేంటి? హరి : ఆదివారం సెలవు కదా టీచర్! |
హరి : రేడియోలు ఇంత తక్కువ రేటుకు అమ్ముడుపోతున్నాయి. మీకేం లాభం? గిరి : రిపేర్లకు నా దగ్గరకే వస్తాయి కదా! |
నాన్నా: గిరి! నువ్వు పది పాసయితే ఒక సైకిల్ కొని పెడతారా! ఒకవేళ పది ఫెయిల్ అయ్యావనుకో పది సైకిళ్ళు కొనిపెడతాను. గిరి : అదేం లెక్క నాన్నా! పది సైకిళ్ళు నేనేం చేసుకోను? నాన్నా : సైకిల్ షాపు పెట్టుకోను. |
హరి : నాన్నా నాకో సన్నాయి కొనిపెట్టవా? నాన్నా : వేళాపాళా లేకుండా వాయిస్తే తల పగిలిపోతుందిరా! హరి : మీకు ఇబ్బంది లేకుండా మీరు నిద్ర పోయినప్పుడు వాయించుకుంటాన్లే నాన్నా! |
హరి: అదేంటయ్యా రైలు టికెట్ కొనకుండా ప్లాట్ ఫారం టికెట్టే తీసుకున్నావ్? గిరి : నేను దిగేది తిరుపతి ఫ్లాట్ ఫారం మీదేగా ! |
హరి : నువ్వు ప్రింట్ చేసిన దొంగ నోట్లను పోలీసులు అంత సులభంగా ఎలా పట్టుకున్నారు? గిరి : నాణ్యత బాగుండాలని మందంగా ముద్రించా! |
హరి : ఈ బస్సు డ్రైవర్ కి అస్సలు దయ, జాలి లేవు! గిరి : ఎందుకలా అంటున్నావ్? హరి : మనల్ని చూసి కండక్టర్ లేచి తన సీటు ఇచ్చాడు. కానీ డ్రైవర్ మాత్రం ఇవ్వలేదు! |
టీచర్: రవి! వారానికి ఎన్ని రోజులంటే ఆరని రాసావేమిటి? రవి : ఆదివారం సెలవు కదా టీచర్! |
గీత : ఎందుకో, నాకు లెక్కల బుక్కు (Maths book) ని చూస్తే జాలేస్తుంది. సన్నీ : ఎందుకు? గీత: ఎందుకంటే, పాపం దాన్నిండా సమస్యలే(problems) ఉంటాయి కదా ! |
చంటి : మాతాత సింహంలా బతికారు. మానాన్న పులిలా బతికారు. నేను ఏనుగులా బతకాలనుకుంటున్నా... బంటి : అయితే మీ ఇంట్లో ఎవరూ మనుషుల్లా బతకరా? |
భార్య : కొత్త చెప్పులు కొన్నారుగా, వేసుకోలేదేం? భర్త : షాపువాడు నాలుగైదు రోజులు కరుస్తాయని చెప్పాడు. తర్వాత వేసుకుందామని! |
డాక్టర్ : మీ ముందు తరం వారెవరికైనా గ్యాస్ సమస్య ఉండేదా? బంగారయ్య: వాళ్ళంతా గ్యాస్ వాడలేదు. కట్టెలు, బొగ్గులతోనే వంట చేసేవారు. |
కాంతయ్య : ఇంతకీ నిరాహారదీక్ష అంటే ఏమిటి? బంగారయ్య : ఆ నీరు, ఆహారం మాత్రమే తినడం! |
టీచర్ : హరి! పంచపాండవులు అని ఎవరిని అంటారు? హరి: పంచలు కట్టుకొనే వారిని టీచర్! |
హరి : "నీవేప్పుడైనా చార్మినార్ చూశావా? గిరి : చూడ్డమేమిటి? నేను కాల్చేది కూడా చార్మినారే". |
హరి : "జీవిత మంటే రోతగా ఉందిరా, నిజం చెప్పాలంటే చచ్చిపోవాలనిపిస్తోంది". గిరి : "బాబ్బాబు ........ ఈనెల 18 వ తారీఖు వరకు ఆగరా" హరి : ఎందుకు? గిరి : "ఆ రోజే నా పెళ్లి. నీవిచ్చే కానుక మిస్ అవుతాను" |
బంగారయ్య : "ఈ రోజు నేను గారడిలో నా టోపీ లోనుంచి కుందేలును తీశాను తెలుసా"? తాయారమ్మ : "బాగా గుర్తు చేశారు. ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి. ఈ పూటకి అరకేజి బరువున్న ఒక కోడిని తీయండి. బటర్ చికెన్ చేసుకుందాం" |
హరి : " మా ఆవిడ మాటల్లో కేవలం పది శాతం మాత్రమే నేను వింటున్నానట" గిరి : "ఎంత అదృష్టవంతుడివిరా" హరి : "అదృష్టమా బొందా ......... ఈ మాట విన్నప్పటి నుంచి మా ఆవిడ మాట్లాడ్డం పది రెట్లు పెంచింది". |
తాయారమ్మ : "మీ మగాళ్ళు ఏ మాటైనా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు" ఎగతాళి చేసింది. బంగారయ్య : "మీ ఆడాళ్ళు మాత్రం ........ రెండు చెవుల్తో విని నోటితో వదిలేయారూ". |
హరి : మీ కాళ్ళు తొక్కాను చూసుకోలేదు "క్షమించండి" గిరి : "కళ్ళు మూసుకుపోయి కాలు తొక్కింది కాక, క్షమించండి అంటావా? మర్యాదగా 'సారీ' చెప్పు" |
చిన్న ఈగ: "బేబీ ... రెక్కలొచ్చాక నీ మొదటి విహారం ఎలా జరిగింది? తల్లి ఈగ : "అద్భుతం ...... నేను ఎగురుతుంటే అంతా ఒకటే చప్పట్లు..... " |
చింటు : నేను శుక్రవారం పుట్టాను బంటి : మరి నేను ఆదివారం పుట్టాను! చింటు : ఆ రోజు సెలవు కదా! |
టీచర్ : హరి ! హోం వర్క్ చేయలేదేం? హరి : మానాన్న ఊళ్లో లేరు టీచర్! |
భర్త : నాకు చలి జ్వరం వచ్చినట్టుంది......... భార్య : చలికాలం చలి జ్వరం కాక, ఎండ జ్వరం వస్తుందా? |
హరి : భయం అన్న పదమే నాకు తెలీదు.......... గిరి : డిక్షనరి చూడు తెలుస్తుంది! |
టీచర్ : హరి న్యాయం, అన్యాయం అంటే ఏమిటో చెప్పు? హరి : క్లాస్ రూం లో మీరు పాఠం చెప్పడం న్యాయం. టీచర్ : మరి అన్యాయం అంటే? హరి : చెప్పిన పాఠం నుంచి వెంటనే ప్రశ్నలు అడగటం అన్యాయం. |
టీచర్ : హరి , అరటి పండు ఉపయోగాలేంటి? హరి : అరటి పండు తింటే ఆరోగ్యం....... తొక్క తొక్కితే వైద్యం టీచర్ : ఏం తిక్క తిక్కగా ఉందా? హరి : పండు తింటే మనకు ఉపయోగం, మరి తొక్క తొక్కితే డాక్టర్ కి ఉపయోగం.... రెండూ ఉపయోగాలే కదా టీచర్. |
టీచర్ : హరి! చీమ పెద్దదా? ఏనుగు పెద్దదా? హరి : రెండింటిలో ఏది ముందు పుడితే అదే పెద్దది టీచర్. |
"ఆకాశంలో వేగముగా వెళ్తున్న రాకెట్, విమానం రెండూ ఒక చోట కలిశాయి. వెంటనే రెండూ ఇలా మాట్లాడుకోవటం ప్రారంభించాయి. " విమానం : 'నువ్వు చాలా గ్రేట్ బ్రదర్... చాలా వేగముగా దూసుకువెళతావు' అని రాకెట్ తో అంది. రాకెట్ : 'దాందేముంది బ్రదర్.... నీకు వీపు మీద మంట పెడితే నువ్వు కూడా రివ్వున ఎగిరి పోతావ్' అంది రాకెట్. |
హరి : "అరే ........ పిల్లి - ఎలుక సంబందానికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పరా" రాము : "నువ్వూ , మీ భార్య. ఇంతకన్నా గొప్ప ఉదాహరణ చెప్పడం నాకు సాధ్యం కాదురా" |
హరి : నిన్న చూసిన సినిమాకే మళ్లీ ఎందుకు వెళ్తున్నావ్? రాము : నిన్న సినిమా హాల్లో పర్స్ దొరికిందని! |
టీచర్ : హరి! ఇంటికి వెళ్లి ఏం చేస్తావు? హరి : గంట ఆడుకొని తర్వాత పుస్తకం తెరుస్తా! టీచర్ : చాలా మంచిది. ఇంతకీ ఏ పుస్తకం? హరి : ఫేస్ బుక్! |
రాణి : నేను మీ సంతోషం కోసం వ్రతం చేయాలనుకుంటున్నా..... రాము : అయితే మౌన వ్రతం చెయ్యి! |
సోము : రైలు ఎక్కాక కూడా ఆ బస్తాను తలపైనే ఎందుకు పెట్టుకున్నావ్? హరి : నా బరువుతో పాటు బస్తా బరువు కూడా రైలే ఎందుకు మొయ్యటమని! |
హరి : ఇప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చి మళ్లీ ఇంకొక డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తున్నావు ఎందుకు? రాము : మొదటి డాక్టరు జలుబుకు వేసిన బిల్లు చూసి గుండెనొప్పి వచ్చింది! |
పొలీస్ : మొన్న దొంగలు పడితే ఈ రోజు ఫిర్యాదు చేస్తున్నావు ఎందుకు? సోము : ఆ రెండురోజులు నాకు మౌనవ్రతమని! |
అమ్మ : తమ్ముడికి తిట్లు నేర్పిస్తున్నావా? బంటి : లేదమ్మా! ఇలా అనకూడదని చెబుతున్నా! |
హరి : జిరాక్స్ తీయటానికి వంద రూపాయలు కావాలి కొంచెం అప్పిస్తావా? సోము : అప్పెందుకు నేను 100 నోటును జిరాక్స్ చేసి ఇస్తాలే! |
సోము : రైల్లో పై సీటు రావడం వల్ల నిద్ర పట్టలేదు? హరి : మరి కింది సీటులో ఉన్నవారిని అడగక పోయావా? సోము : అడుగుదామనే అనుకున్నా కానీ ఎవరూ లేరు! |
చంటి : నేను ఈ రోజు 50 రూపాయలు సంపాదించా... బంటి : ఎలా? చంటి : పాట పాడతానంటే మా మామయ్య 20 ఇచ్చాడు. తర్వాత ఆపని 30 ఇచ్చాడు. |
రాము : సమోసా లోపలిది తిని బయటిది పారేస్తున్నావ్ ఎందుకు? చంటి : డాక్టర్ బయట ఆహారం తినవద్దు అని చెప్పారు. అందుకని! |
రాము : రేయ్! నువ్వు నిద్రలేచిన వెంటనే ఎవరి ముఖం చూస్తావ్? గోపి : ఆఫీస్ లోనా, ఇంట్లోనా? |
మోహన్ : మీ నాన్న గారి రచనలలో మీకు బాగా నచ్చింది ఏది? రాజా : ఆయన రాసిన వీలునామా! |
డాక్టర్ : మీకు గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంది కదూ! గోపి : అవునండి! సిలిండర్ ఇంటికి రావడానికి చాలా కష్టమవుతోంది! |
రాము : సినిమాకి పుస్తకాలెందుకు తెచ్చావ్? గోపి : టైం వృదా చేయకుండా ఇంటర్వెల్ లో చదువుకుందామని! |
రాము : నిన్ను చూస్తే నా మనసు ఉరకలేస్తుంది గీతా! గీతా : అయితే వెనుకున్న మా అన్నను చూడు నీ కాళ్ళు పరుగెడతాయి! |
బంటి : ఆ పూజారి గారు భక్తులందరి నుదుటికీ విభూతి ఎందుకు పెడుతున్నారు? సోము : రెండోసారి ప్రసాదానికి వచ్చేవాళ్ళను గుర్తు పట్టేందుకు! |
గోపి : ఏంటీ? ఆ షాపు వాడి మీద అంత కోపంగా ఉన్నావ్? రాము : కుక్క బిస్కట్లు అడిగితే ఇక్కడ తింటావా, పార్శలా అని అడిగాడు! |
గీత : మానాన్న బాగా పాటలు పాడుతారు! రాధ : ఏ పాటలు ? గీత : వేలం పాటలు! |
భర్త : ఏంటీ బ్యాగు పట్టుకొని ఎటు వెళ్తున్నావ్? భార్య : మా పుట్టింటికి భర్త : ఎందుకు ? భార్య : నిన్న గొడవైనప్పుడు మీరే సర్దుకుపొమ్మన్నారుగా! |
సౌరవ్ : మీ అబ్బాయి ఎందుకలా కుక్క మీద కూర్చొని రాస్తున్నాడు ? గౌరవ్ : వాళ్ళ టీచరు కుక్క మీద వ్యాసం రాయమంటేను ! |
గీత : గోపి ! నా జీవితమంతా నీ నీడలోనే గడపాలనుంది ! గోపి : అంటే నేను జీవితాంతం ఎండలో నిల్చోవాలా ? |
రాము : నా భార్య ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది ? గోపి : మరి గేదలిస్తే ఏం లెక్క పెడుతుంది. |
చంటి : రోజూ బడికి ఆలశ్యముగా వచ్చేవాడివి. ఇవాళ త్వరగా వచ్చావేమిటి? బంటి : దారిలో పిచ్చికుక్క వెంటపడితేనూ ! |
లత : మా నాన్న చదరంగం బాగా ఆడుతాడు తెలుసా ? రాధ : మా నాన్న కూడా బాగా ఆడుతాడు ...... లత : ఏం ఆడుతాడు ? రాధ : అబద్దాలు ! |
తల్లి : ఒరేయ్ చంటి ! తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడో చూడు .... చంటి : ఉండమ్మా ! వాడి చాక్లెట్లు నాకు దొరికాయ్. తిన్నాక చూస్తా ! |
డాక్టర్ : మీరెప్పుడైనా న్యుమోనియాతో బాధపడ్డరా? గోపి : చిన్నప్పుడు స్పెల్లింగ్ రాయటానికి! |
మధు : అదేంటి? టాబ్లెట్ల ని అలా అయస్కాంతం దగ్గర పెట్టావ్ ? గోపి : డాక్టర్ గారు నాకిచ్చినవి ఐరన్ టాబ్లెట్ లని అన్నారు. పరీక్షిద్దామని! |
చంటి : మనం మాట్లాడే భాషని మాతృభాష అని ఎందుకు అంటారు నాన్నా! నాన్నా : మాట్లాడటానికి నాన్నలకు అవకాశం లేదు కాబట్టి! |
రాధ : బ్యాంకు నుంచి లోన్ తీసుకోని స్కూటర్ కొనుక్కున్నా, వాయిదాలు సరిగా కట్టకపోయేసరికి స్కూటర్ తీసుకొని వెళ్లారు. మంజు : అరే ఇదేదో కాస్త ముందు తెలిస్తే బాగుండేదే, నా పెళ్ళికి లోన్ తీసుకొనేదాన్ని. |
గోపి : నేనో కంప్లైంట్ ఇవ్వాలి .... రాము : దానికో బాక్స్ ఉందిగా .... గోపి : అది కనిపించడం లేదనేదే నా కంప్లైంట్ |
(రెండు కుక్కలు ఇలా మాటలాడుకుంటున్నాయి) టామి : నేను రాత్రిళ్ళు కాపలా కాయను. హాయిగా నిద్రపోతా ... జూలి : ఎందుకు ? టామి : మా యజమానికి నిద్దర్లో అరిచే అలవాటు ఉందిలే .... జూలి : ఆ అరుపులకు నిద్ర పట్టక చస్తున్నా! |
చందు : ఒక వ్యక్తి మనకు ఐదు సంవత్సరములు కనబడలేదంటే, అతను ఏమై ఉంటాడు? గోపి : ఎన్నికల్లో గెలిచి ఉంటాడు! |
నాన్న: అల్లుడు గారు నిన్నుపువ్వుల్లో పెట్టి బాగా చూసుకుంటున్నారు కదా? అలా కంగారు పడుతూ వచ్చావేం? కూతురు : ఆ పువ్వులు కొనడానికే డబ్బులు తెమ్మన్నారు నాన్నా! |
భార్య: మీ పిసినారి తనం రోజురోజుకు భరించలేకపోతున్నాను. ఉరివేసుకొని చచ్చిపోతా! భర్త : ఉరితాడు కొనకు! పైన అటకపై పాత తాడు ఉంది! |
పోలీస్: ఏం సోము! ఈ సైకిల్ దొంగతనాలు ఇంకా ఎంత కాలం చేస్తావు ? ఆపవా? సోము : బైక్ నేర్చుకోవడం వచ్చేస్తానే ఆపేస్తాను సార్! |
రాము : బన్నీ ! స్కూల్లో రెండు కప్పులు దేనికొచ్చాయ్ ! బన్నీ : ఒకటి జ్ఞాపక శక్తికి! ఇంకోటి దేనికో గుర్తుకురావడం లేదు నాన్నా! |
భర్త : రాధా ! టీ ఏంటి ఈ రోజు ఇంత రుచిగా ఉంది ? భార్య : అయ్యో! నా కప్పు మీకిచ్చినట్లున్నా! |
ప్రకాష్ : పెళ్లికి ముందు నన్ను తెలివైన వాణ్ని , చాలా చురుకైన వాణ్ని అని రోజు మెచ్చుకునే దానివి, ఇప్పుడు మానేశావేం? లక్ష్మీ : జీవితాంతం అబద్దాలెక్కడ అడగలనండీ. |
టీచర్ : నీరు పల్లమెరుగు. నిజం దేవుడెరుగు లాంటి ఒక వాక్యం చెప్పు రాము! రాము : నాన్న జీతమెరుగు, అమ్మ షాపింగ్ ఎరుగు. |
నరేష్ : అదేంట్రా? మీ ఆవిడ బ్రేక్ ... బ్రేక్ .... మని తేనుస్తోంది? నగేష్ : టీవీ యాంకర్ గా పని చేస్తోందిలే ! |
బంటి : మొన్న మీ ఇంట్లో దొంగలు పడితే మీ తాతయ్య నోరెత్తలేదా ? ఎందుకని ? భయమా ? చంటి : అబ్బే ...... ఆయన నోట్లో రెండు బంగారపు పళ్లు ఉన్నాయిలే ! |