
"ఇప్పుడు నీఆరోగ్యం ఎలా ఉంది?గుండె ఆపరేషన్ అయ్యాక ఇప్పుడే కనిపిస్తున్నావు". అడిగాడు డాక్టర్ అప్పారావుని.
"అదేమిటో డాక్టర్ గుండె ఆపరేషన్ అయినప్పటి నుండి లోపల రెండు గుండెలు ఉన్నట్లు అనుమానంగా ఉంది. రెండు లబ్ డబ్ లు వినిపిస్తున్నాయి." అనుమానం వ్యక్తపరిచాడు అప్పారావు.
"చూసారా డాక్టర్, ఈయనకి గుండె ఆపరేషన్ అయినరోజు మీ రిస్ట్ వాచీ నేనే కొట్టేశానని అనవసరం గా నన్ను తిట్టారు..............ఇప్పుడేమంటారు?" పక్కనే ఉన్న తాయారు నింపాదిగా చెప్పింది.
ఆఆఆఆఆఆఆఆఅ...........................