Haranath(September 2, 1936 – November 1, 1989) - Actor

హరనాథ్ (1936 - 1989) ప్రముఖ తెలుగు సినిమా నటుడు.He was a very popular Tollywood lead actor in the 60's being regarded as a romantic icon.ఈయన పూర్తి పేరు భూపతిరాజు హరనాద్ రాజు.ఈయనకి ఒక కొడుకు,కూతురూ ఉన్నారు. ఇతని అల్లుడు సినిమా నిర్మాత జి.వి.జి.రాజు.పవన్ కళ్యాణ్ తొ తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించింది ఇతనే. హరనాద్ కుమారుడి పేరు శ్రీనివాసరాజు. ఇదె పేరుతొ తెలుగు సినిమా హీరో ఇంకొకరున్నారు. శోభన్ బాబు నటించిన సర్పయాగం లొ నటించాడు. రోజా హీరోయిన్.హరనాద్ సోదరుడు సుబ్బరాజు కూడా సినీ నటుడే. ఇతను క్రాంతి అనె సినిమాలొ నటిస్తూ అకస్మాత్తుగా మరణించాడు.హరనాథ్ 1936, సెప్టెంబర్ 2న [తూర్పు గోదావరి]జిల్లా గొల్లప్రోలు మండలంరాపర్తిలో జన్మించాడు. ఈయన అనేక స్వల్ప వ్యయంతో నిర్మించే సినిమాలలో కథానాయకుడుగా నటించాడు. కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. ఒక రోజు మద్రాసులోని పాండీ బజార్లో చెప్పులు కొనుక్కుంటుండగా దర్శకుడు గుత్తా రామినీడు హరనాథ్ ను చూసి తను తీయబోతున్న కొత్త చిత్రం మా ఇంటి మహాలక్ష్మిలో కథానాయకుడి పాత్రకోసం ఎన్నుకున్నాడు. హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా, మా ఇంటి మహాలక్ష్మి (1959) తో హరనాథ్ కథానాయకుడుగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించాడు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.నందమూరి తారక రామారావు, తన సొంత సంస్థ ఎన్.ఎ.టి పతాకంపై దర్శకత్వం వహించి నిర్మించిన తొలి చిత్రం సీతారామకళ్యాణంలో కథానాయకునిగా హరనాథ్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీయార్ రావణుని పాత్ర పోషిస్తే హరనాథ్ రాముని వేషం వేశాడు.
చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... చిరంజీవి నటించిన, నాగు సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
నటించిన సినిమాలు:
కలవారి సంసారం (1982)
గడసరి అత్త సొగసరి కోడలు (1981)
బాల భారతం (1972)
భలే పాప (1971)
కథానాయిక మొల్ల (1970)
శ్రీదేవి (1970)
తల్లి తండ్రులు (1970)
చల్లని నీడ (1968)
నడిమంత్రపు సిరి (1968)
బంగారు సంకెళ్ళు (1968)
భక్త ప్రహ్లాద (1967)
చదరంగం (1967)
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
లేత మనసులు (1966)
శ్రీకృష్ణ పాండవీయం (1966)
చంద్రహాస (1965)
సర్వర్ సుందరం (1964)
అమరశిల్పి జక్కన్న (1964)
మురళీకృష్ణ (1964)
పెంపుడు కూతురు (1963)
గుండమ్మ కథ (1962)
భీష్మ (1962)
కలసివుంటే కలదుసుఖం (1961)
పెళ్లికాని పిల్లలు (1961)
శ్రీసీతారామ కళ్యాణం (1961)
రుణానుబంధం (1960)
మా ఇంటి మహాలక్ష్మి (1959)
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express