G.Varalakshmi(1926 - 2006) - Actress

గరికపాటి వరలక్ష్మి అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి తెలుగు సినిమా నటీమణి. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.She is well remembered for her arrogant roles in movies like Drohi and Leta Manasulu.
జీవిత విశేషాలు:
వరలక్ష్మి 1926లో ఒంగోలులో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి విజయవాడ చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి సక్కుబాయి మరియు రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు మరియు హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.She later acted in popular movies like Kula Gotralu, Kanna Talli and Pelli Chesi Choodu movies. She acted with all top heroes in 1940s and 1950s in Telugu and Tamil. She played roles of both the loving woman and arrogant sister or mother-in-law. She also directed a social movie Moogajeevulu. She joined politics and supported M.G.R for short time. She was active member in Andhra Pradesh Praja Natya Mandali.వరలక్ష్మి 2006 నవంబర్ 26న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.

చిత్ర సమాహారం:
నటిగా:
గోరంత దీపం (1978)
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
అత్తవారిల్లు (1976)
సంసారం సాగరం (1973)
బుద్ధిమంతుడు (1969)
బంగారు పిచ్చుక (1968)
లేత మనసులు (1966)
అంతస్థులు (1965)
కుళందయుమ్ దెయివముమ్ (1965)
సుమంగళి (1965)
కులగోత్రాలు (1962)
ఇద్దరు మిత్రులు (1961)
రాజనందిని (1958)
మాంగల్యబలం (1958)
దొంగల్లో దొర (1957)
కర్పూరకరసి(1957)
మేలుకొలుపు (1956)
అంతే కావాలి (1955)
మా గోపి (1954)
మేనరికం (1954)
కన్నతల్లి (1953)
నా చెల్లెలు (1953)
పరోపకారం (1953/I)
మానవతి (1952)
పెళ్ళి చేసి చూడు (1952)
దీక్ష (1951)
నిర్దోషి (1951)
మాయా రంభ (1950)
మొదటి రాత్రి (1950 సినిమా) (1950)
శ్రీ లక్ష్మమ్మ కథ (1950)
స్వప్న సుందరి (1950)
వింధ్యరాణి (1948)
ద్రోహి (1948)
భక్త ప్రహ్లాద (1942)
దక్షయజ్ఞం (1941)
బారిష్టర్ పార్వతీశం (1940)
 దర్శకురాలిగా:
మూగ జీవులు (1968)
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express