Suthi Veerabhadra Rao(6th June 1947 - 30th June 1988) - Actor

సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు (1947-1988) తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు.

బాల్యము:

వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రధమ సంతానము. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడ కు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాసలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావు ని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల దర్సకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రముతో చిత్రసీమ లో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల దర్సకత్వములో వచ్చిన చూపులు కలసిన శుభవేళ చిత్రము ఆఖరి చిత్రము.

మరణము:
1988 లో చూపులు కలసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదు లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. మధుమేహముతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే ఆయన ఆఖరి క్షణాలు.అది 1988, జూన్ 30 తెల్లవారుఝామున జరిగింది.
Filmography:
1988 Choopulu Kalasina Subhavela (Jandhyala )
1988 Vivaha Bhojanambu( Jandhyala )
1988 O tandri teerpu (Rajachandra )
1988 Neeku Naku Pellanta( Jandhyala )
1988 Chikkadu Dorakadu( Narasimha Rao )
1988 Sahasam Cheyara Dhimbaka (Narasimha Rao Relangi )
1988 Chinni Krishnudu (Jandhyala )
1988 Pelli Chesi Choodu (Narasimha Rao Relangi )
1987 Dabbevariki Chedu (Narasimha Rao Relangi )
1987 Aha Naa Pellanta (Jandhyala )
1986 Chantabbai( Jandhyala )
1986 Jeevana Poratam (Rajachandra )
1986 Padaharella Ammayi( Krishna Mohan Reddy )
1986 Sri Shirdi Saibaba Mahathyam (K. Vasu )
1985 Chattamtho Poratam (K.Bapayya )
1985 Mogudu Pellalu (Jandhyala )
1985 Swathi Muthyam (K. Viswanath)
1985 Oka Radha iddaru Krishnulu (A. Kodanda Rami Reddy )
1985 Rendu Rella Aaru (Jandhyala )
1984 Srivariki Premalekha (Jandhyala )
1984 Babai Abbai (Jandhyala )
1984 Ananda Bhairavi (Jandhyala )
1984 Sundari Subbarao( Narasimha Rao Relangi )
1984 Rustum (A. Kodandarami Reddy )
1983 Konte Kodallu (Kommineni Seshagiri Rao )
1983 Muggurammaiyala Mogudu
1983 Puththadi Bomma (Jandhyala )
1983 Palleturi Monagadu (S. A. Chandrasekhar )
1983 Moodu Mullu (Jandhyala)
1982 Brahmaa nee raata taarumaaru (Tripuraneni Varaprasad)
1982 Naalugu Sthambaalaata (Jandhyala)
1981 Erra Mallelu (Dhavala Sathyam)
1974 Dorababu (Tatineni Rama Rao )
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express