Gummadi (July 9th 1927 - January 26th 2010) - Actor

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
బాల్యము  మరియు విద్యాభ్యాసం:
                        గుమ్మడి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. 1944లో ఎస్.ఎస్.సి ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు. తల్లితండ్రులు చదువు చాలించి ఇంటిదగ్గర పొలం పనులు చూసుకోమని ఒత్తిడి చేసినా, వాళ్లని ఒప్పించి కొల్లూరు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఈయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పాఠశాలలో తెలుగు పంతులు జాస్తి శ్రీరాములు చౌదరి ఈయన్ను ఎంతగానో ప్రభావితము చేశాడు.       
                         గుమ్మడి సినీప్రవేశం అదృష్ట దీపుడు (1950) సినిమాతో (కథానాయకుడిగా) జరిగింది. ఎన్.టి.ఆర్ సొంత సినిమా తోడుదొంగలు లో ఎన్.టి.ఆర్ తో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే కారెక్టర్ నటునిగా మారారు. నిజానికి రామారావు, నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్న ఐనా అనేక చిత్రాలలో ఆ ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించారు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించారు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించారు. అత్యంత విరుద్ధమైన వసిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రసంసలు అందుకున్నారు. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రం లో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలు గా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన.అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.(తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ(డబ్బింగు) మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతోపాటు ప్రతినాయకునిగా (నమ్మినబంటు, లక్షాధికారి) కూడా నటించారు .
గుమ్మడి 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరుతో జీవనస్మృతుల్ని అక్షరీకరించారు. తొలి ముద్రణ ప్రతులన్నీ కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు.
గుమ్మడి జనవరి 26, 2010న మరణించారు.
నటించిన చిత్రాలు:
 1950 అదృష్ట దీపుడు (మొదటి సినిమా)
1953 పిచ్చి పుల్లయ్య( భోపాలరావు)
1954 తోడు దొంగలు (లోకనాథం)
1955 కన్యాశుల్కం( సౌజన్యారావు పంతులు)
అర్ధాంగి( జమిందారు)
జయసింహ (రణధీర్)
మిస్సమ్మ (Employer (guest role))
రాణి రత్నప్రభ
1956 చిరంజీవులు( డాక్టర్ కృష్ణ)
ఏది నిజం( మునసబు)
ఇలవేల్పు (శేఖర్ తండ్రి)
Pennin Perumai
1957 సువర్ణ సుందరి
మాయాబజార్( బలరాముడు)
దాంపత్యం
దొంగల్లో దొర
ఎం.ఎల్.ఏ. దామోదరం
Premada Putri
ప్రేమే దైవం
సారంగధర
సతీ అనసూయ
వీర కంకణం
వినాయక చవితి (సత్రాజిత్తు)
1958 ఆడ పెత్తనం
చెంచులక్ష్మి( దూర్వాసుడు)
దొంగలున్నారు జాగ్రత్త
ఎత్తుకు పై ఎత్తు (గోవిందయ్య)
ఇంటి గుట్టు
1959 ఇల్లరికం (జమిందారు)
జయభేరి (విశ్వనాథ శాస్త్రి)
కృష్ణ లీలలు
మా ఇంటి మహలక్ష్మి
నమ్మిన బంటు
పెళ్ళి సందడి
రాజ మకుటం( ప్రచండుడు)
శభాష్ రాముడు
సతీ తులసి
సిపాయి కూతురు
1960 దీపావళి నాగదత్తుడు
హరిశ్చంద్ర విశ్వామిత్ర మహర్షి
పెళ్ళి కానుక
రేణుకాదేవి మహత్యం
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి
శాంతినివాసం
శ్రీ వెంకటేశ్వర మహత్యం (భృగు మహర్షి)
1961 భార్యాభర్తలు (ఆనంద్ తండ్రి)
ఇద్దరు మిత్రులు (భానోజీరావు)
పాండవ వనవాసం (ధర్మరాజు)
ఋష్యశృంగ
ఋష్యశృంగ
శాంత
సీతారామ కళ్యాణం (విశ్వామిత్ర మహర్షి)
తండ్రులు కొడుకులు
వాగ్దానం (రంగానాథం)
1962 ఆరాధన (ప్రిన్సిపాల్)
భీష్మ (కర్ణుడు)
కానిస్టేబుల్ కూతురు (కానిస్టేబుల్ ధర్మయ్య)
కలిమిలేములు
ఖైదీ కన్నయ్య
కులగోత్రాలు( భూషయ్య)
మహామంత్రి తిమ్మరుసు తిమ్మరుసు
సిరి సంపదలు
1963 చదువుకున్న అమ్మాయిలు
ఇరుగు పొరుగు
లక్షాధికారి( సీతయ్య)
మూగ మనసులు (జమిందారు)
పరువు ప్రతిష్ట
పునర్జన్మ
సవతి కొడుకు
శ్రీ కృష్ణార్జున యుద్ధం ధర్మరాజు
తిరుపతమ్మ కథ
1964 ఆత్మబలం (మానసిక వైద్యుడు)
ఈడు జోడు (లక్ష్మీపతి)
డాక్టర్ చక్రవర్తి
మంచి మనిషి
మురళీకృష్ణ
పూజాఫలం దివాన్ రామకృష్ణయ్య
రామదాసు కబీర్
వారసత్వం
వెలుగు నీడలు
1965 ఆత్మ గౌరవం
అంతస్తులు (జమిందారు)
చంద్రహాస
సి.ఐ.డి. (చలపతి)
కీలు బొమ్మలు
నాదీ ఆడజన్మే
ప్రేమించి చూడు
సత్య హరిశ్చంద్ర
1966 భక్త పోతన పోతన
కన్నె మనసులు
నవరాత్రి
పల్నాటి యుద్ధం
శ్రీ కృష్ణ పాండవీయం
1967 కాంభోజరాజు కథ
ప్రాణమిత్రులు( దివాన్)
ప్రైవేటు మాస్టారు
రహస్యం
సుడిగుండాలు (డిఫెన్స్ లాయర్)
1968 బందిపోటు దొంగలు (డాక్టర్)
బంగారు సంకెళ్ళు
గోవుల గోపన్న
మన సంసారం
పాల మనసులు
1969 అదృష్టవంతులు
ఆదర్శ కుటుంబం
ఆత్మీయులు (జగన్నాధం)
భలే రంగడు
బుద్ధిమంతుడు
మనుషులు మారాలి
శ్రీ రామ కథ
తారాశశాంకం
1970 అక్కా చెల్లెలు( ధర్మయ్య)
అగ్ని పరీక్ష
జై జవాన్
మరో ప్రపంచం
పూల రంగడు( చలపతి)
శ్రీదేవి
1971 అమాయకురాలు
భాగ్యవంతుడు
భార్యాబిడ్డలు
దసరా బుల్లోడు
మోసగాళ్ళకు మోసగాడు( దానాల ధర్మయ్య)
నేనూ మనిషినే
ప్రేమనగర్
సంపూర్ణ రామాయణం (దశరథుడు)
శ్రీకృష్ణ సత్య
శ్రీమంతుడు
సిసింద్రీ చిట్టిబాబు
సుపుత్రుడు
విచిత్ర దాంపత్యం
1972 బంగారు బాబు
ఇద్దరు అమ్మాయిలు (రామానుజం)
కాలం మారింది
కొడుకు కోడలు
నీతి నిజాయితి
పండంటి కాపురం
తాత మనవడు (పరమాత్మారావు)
విచిత్ర బంధం
1973 జీవన తరంగాలు (వేణుగోపాలరావు)
కన్నవారి కలలు
మల్లమ్మ కథ
మరపురాని మనిషి
మైనరు బాబు
సంసారం సాగరం
విచిత్ర వివాహం
వింత కథ
1974 అల్లూరి సీతారామరాజు
అమ్మాయి పెళ్ళి
అనగనగా ఒక తండ్రి
భూమి కోసం
దేవదాసు
దొరబాబు
గాలిపటాలు
ఇంటింటి కథ
మనుషుల్లో దేవుడు తండ్రి
1975 బాబు
సంసారం
సౌభాగ్యవతి
సోగ్గాడు సింహాద్రి
యశోదకృష్ణ నందుడు
జమిందారు గారి అమ్మాయి
1976 రామరాజ్యంలో రక్తపాతం
మంచికి మరోపేరు
ఒక దీపం వెలిగింది
బంగారు మనిషి (వేణు తండ్రి)
పాడవోయి భారతీయుడా
జ్యోతి రాజయ్య
సెక్రటరీ
సీతాకల్యాణం దశరథుడు
సీతా స్వయంవర్ (హిందీ) దశరథుడు
యవ్వనం కాటేసింది
1977 ఆలుమగలు
చక్రధారి
ఇంద్రధనుస్సు
కల్పన
కురుక్షేత్రం( భీష్ముడు)
సీతారామ వనవాసం
1978 చల్ మోహనరంగా
అక్బర్ సలీం అనార్కలి
దేవదాసు మళ్లీ పుట్టాడు
సాహసవంతుడు
1979 కెప్టెన్ కృష్ణ
గంగా భవానీ
ఇంటింటి రామాయణం
కార్తీక దీపం
ఖైదీ కృష్ణుడు
మండే గుండెలు
ముద్దుల కొడుకు
నా ఇల్లు నా వాళ్ళు
శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
1980 మోసగాడు
చండీప్రియ
బుచ్చిబాబు
ధర్మచక్రం
గజదొంగ
ఘరానా దొంగ
గోపాలకృష్ణుడు
హేమా హేమీలు
కక్ష
కొత్త జీవితాలు
సర్దార్ పాపారాయుడు
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
శ్రీవారి ముచ్చట్లు
1981 అగ్నిపూలు
అల్లుడు గారూ జిందాబాద్
ఆశాజ్యోతి
భోగభాగ్యాలు
ప్రేమాభిషేకం
ప్రేమ మందిరం
సంధ్యారాగం
1982 మొండి ఘటం
అనురాగ దేవత
బంగారు కానుక
ఈ చరిత్ర ఏ సిరాతో
ఏకలవ్య
జగన్నాధ రథచక్రాలు
కలియుగ రాముడు
మరో మలుపు(  ఉత్తమ నటుడిగా నంది అవార్డు)
రాగదీపం
స్వయంవరం
1983 సంఘర్షణ
ప్రేమ పిచ్చోళ్ళు
ఆడవాళ్లే అలిగితే
ఈ పిల్లకు పెళ్ళవుతుందా
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు
ముందడుగు
పెళ్ళి చూపులు
పోలీస్ వెంకట స్వామి
నెలవంక సీతారామరాజు
రుద్రకాళి
1984 రుస్తుం బ్రహ్మయ్య నాయుడు
రోజులు మారాయి
1985 రక్త సింధూరం( జగన్నాథం)
శ్రీదత్త దర్శనం (జమదగ్ని)
1986 విక్రం (కమీషనర్)
కిరాతకుడు (ధర్మతేజ)
1987 పసివాడి ప్రాణం
తేనె మనసులు
1988 కానూన్ కీ హత్కడీ (హిందీ)
1990 బొబ్బిలి రాజా
1991 పెళ్ళి పుస్తకం (కంపెనీ బాస్ ఉతమ చిత్రానికి నంది అవార్డు)
తల్లిదండ్రులు
1992 బృందావనం
1993 గోవిందా గోవిందా (దూర్వాస మహర్షి)
ముఠా మేస్త్రి ముఖ్య మంత్రి
గాయం
రాజేంద్రుడు గజేంద్రుడు( ఏనుగు యజమాని)
రాజేశ్వరి కళ్యాణం
వారసుడు
1995 ధర్మచక్రం
మాయాబజార్ బలరాముడు
ఆయనకిద్దరు
2008 జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర

Charactered played by him:

  • Balarama
  • Bhishma
  • Maharishi Bhrigu
  • Chief Minister
  • Dasharatha
  • Diwan
  • Doctor
  • Durvasa
  • Farmer
  • Jamadagni
  • Kabir
  • Karna
  • Lawyer
  • Munasabu
  • Nanda
  • Police officer
  • Pothana
  • Principal
  • Satrajit
  • Timmarusu
  • Vishwamitra
  • Yudhisthira
  • Zamindar
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express