Social Icons

Pages

Pasupuleti Kannamba (September 20, 1912 – May 7, 1964) - Actress

ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.

                                  ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి. ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964 లో మే 7 వ తేదీన తుదిశ్వాస వదిలింది.

రావికొండలరావు రచననుండి
                      ‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకధాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.

కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.

చిత్ర సమాహారం: నటిగా
ఆత్మబలం (1964)
రామదాసు (1964)
పరువు ప్రతిష్ట (1963)
లవ కుశ (1963)
ఆప్తమిత్రులు (1963)
ఆత్మబంధువు (1962)
దక్షయజ్ఞం (1962)
జగదేక వీరుని కథ (1961)
ఉషా పరిణయం (1961)
అభిమానం (1960)
రాజ మకుటం (1959/I)
అన్నా తమ్ముడు (1958)
మాంగల్య బలం (1958)
శ్రీకృష్ణ మాయ (1958)
కుటుంబ గౌరవం (1957/I)
Makkalai Petra Maharasi (1957)
తోడికోడళ్ళు (1957)
చరణదాసి (1956)
అనార్కలి (1955)
శ్రీకృష్ణ తులాభారం (1955)
మనోహర (1954)
సౌదామిని (1951)
పల్నాటి యుద్ధం (1947)
మాయాలోకం (1945)
మాయా మచ్చీంద్ర (1945)
పాదుకా పట్టాభిషేకం (1945)
మహామాయ (1944)
కన్నగి (సినిమా) (1942)
సుమతి (1942)
అశోక్ కుమార్ (1941)
తల్లిప్రేమ (1941)
భోజ కాళిదాస (1940)
ఛండిక (1940)
మహానంద (1939)
గృహలక్ష్మి (1938)
కనకతార (1937)
సారంగధర (1937)
ద్రౌపది వస్త్రాపహరణం (1936)
హరిశ్చంద్ర (1935)
సీతా కళ్యాణం (1934)

Playback singer:These are some of the Telugu songs voiced by her for the films.
Year Film Songs

1935 Harishchandra Jananamu Dhanyata Gaada, Karunakara, Sritajana Bandhu

1937 Kanakatara Ee Vasantha Sobha

1938 Grihalakshmi Badha Sahaname, Naa Premaye, Sagamu Rathiri Ayyane, Yashoda Nandana

1940 Chandika Anandamaye Naho, Eme O Koyila, Nene Raninaithe

1941 Talliprema Jo Jo Nandabala, Prema Nidhanamu

1942 Sumati Jayahe Thrishooladhari

1945 Maya Machhindra Dhanyambayyenu Janmamu, Haayiga Paadedanu, Meluko, O Malathi

1946 Mugguru Maratilu Stree Bhagyame Bhagyamu, Teerugada Asha Nedu

1947 Palnati Yudham Evaravaya Deva, Thana Pantamu Naathona, Thera Teeyagarada

Producer:
She has produced about 25-30 films along with her husband Kadaru Nagabhushanam under the banners of Sri Rajarajeswari films, Rajasri pictures and Sri Varalakshmi films.
Year Film Language

1941 Talliprema (Telugu)

1942 Sumati (Telugu )

1944 Harishchandra (Tamil )

1945 Paduka Pattabhishekam( Telugu )

1946 Bhakta Tulasidas (Telugu)

1949 Navajeevanam (Tamil )

1949 Navajeevanam (Telugu )

1949 Tulasi Jalandhar (Tamil )

1951 Saudamini (Tamil )

1951 Saudamini (Telugu )

1952 Ezhai Uzhavan (Tamil )

1952 Peda Rytu (Telugu )

1953 Lakshmi( Tamil )

1953 Lakshmi (Telugu )

1954 Sati Sakkubai (Telugu )

1955 Shri Krishna Thulabaram (Telugu )

1956 Naga Panchami (Tamil )

1956 Naga Panchami (Telugu )

1958 Sri Krishna Maya (Telugu )

1959 Veera Bhaskarudu (Telugu )

1960 Dharmame Jayam (Telugu )

1961 Usha Parinayam (Telugu )

1962 Dakshayagnam (Tamil )

1962 Dakshayagnam (Telugu )

1963 Apta Mithrulu (Telugu )

1965 Chaduvukunna Bharya (Telugu )
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express