Social Icons

Pages

M. Prabhakar Reddy (1935–1997) - Actor

ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తి తో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. మూడు దశకాల్లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. హైదరాబాదులోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.
జీవిత సంగ్రహం:
           ప్రభాకరరెడ్డి, నల్గొండ జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, ఆక్టోబరు 8న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియటు చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్ర్యం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.ప్రభాకరరెడ్డి 1997లో హైదరాబాదులో మరణించాడు.

Prabhakar Reddy debuted in the film Chivaraku Migiledi directed by Gutta Ramineedu in 1960. He has acted as Psychiatrist.He wrote stories for about 21 Telugu films. Some of them are highly successful. They include Pandanti KapuramPacchani Samsaram,DharmatmuduGrihapravesamGandhi Puttina DesamKarthika Deepam and Naaku Swatantram Vacchindi.He gave the name for famous Telugu actress Jayaprada, originally Lalitha Rani, and introduced her in a three minute song in the Telugu film,Bhoomi Kosam in 1976.

పురస్కారాలు:
1981 - నంది ఉత్తమ నటుడు - పల్లె పిలిచింది చిత్రం లోని నటనకు
1980 - నంది ఉత్తమ నటుడు - యువతరం కదిలింది చిత్రం లోని నటనకు
1990లో చిన్నకోడలు సినిమాలో ఉత్తమసహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు
ఉత్తమ కథారచయితగా గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం సినిమాలకు నంది పురస్కారాలను అందుకున్నాడు.
నటించిన చిత్రాలు:
1960  చివరకు మిగిలేది (మానసిక వైద్యుడు)
1961  పాండవ వనవాసం
1962  భీష్మ శంతనుడు
1962  మహామంత్రి తిమ్మరుసు (వీరభద్ర గజపతి)
1963  నర్తనశాల (కర్ణుడు)
1963  పునర్జన్మ
1963  శ్రీ కృష్ణార్జున యుద్ధం (శివుడు)
1964  బొబ్బిలి యుద్ధం
1966  నవరాత్రి (పోలీస్ ఇన్ స్పెక్టర్)
1966  పల్నాటి యుద్ధం( కన్నమ నాయుడు)
1967  శ్రీ కృష్ణావతారం (బలరాముడు)
1967  ఉమ్మడి కుటుంబం
1968  బ్రహ్మచారి
1968   రణభేరి
1969  ఆత్మీయులు
1969  నాటకాల రాయుడు (రామారావు, బుజ్జిబాబు అన్నయ్య)
1969  భలే తమ్ముడు (ఇన్ స్పెక్టర్ శేఖర్)
1970  అక్కా చెల్లెలు( సీనియర్ లాయర్)
1970  హిమ్మత్
1970  లక్ష్మీ కటాక్షం (రాజు)
1971  మట్టిలో మాణిక్యం
1971  మోసగాళ్ళకు మోసగాడు
1971  బస్తీ బుల్ బుల్
1971 &n

bsp;పెత్తందార్లు
1972  బాల భారతం
1972  పండంటి కాపురం
1972  పాపం పసివాడు
1972  పిల్లా పిడుగా రీకు
1973  మాయదారి మల్లిగాడు
1973  సంసారం సాగరం
1974  అల్లూరి సీతారామరాజు
1974  అందరూ దొంగలే
1974  దీక్ష
1975  ఎదురులేని మనిషి
1976  భక్త కన్నప్ప
1976  రామరాజ్యంలో రక్తపాతం
1977  దాన వీర శూర కర్ణ ధర్మరాజు
1977  ఇంద్ర ధనుస్సు
1977  కల్పన (డాక్టర్)
1977  ఖైదీ కాళిదాసు (జగదీష్ చంద్ర ప్రసాద్)
1977  యమగోల (రమణమూర్తి/రామశాస్త్రి)
1978  కటకటాల రుద్రయ్య
1978  అనుగ్రహం (భైరవుని సేవకుడు)
1978  సొమ్మొకడిది సోకొకడిది( బ్లాక్ టైగర్)
1979  గోరింటాకు
1979  కార్తీక దీపం (కథా రచయిత మరియు నటుడు : ధనుంజయ రావు)
1979  రంగూన్ రౌడీ
1980  ఏడంతస్తుల మేడ
1980  నకిలీ మనిషి( సి.ఐ.డి. ప్రభాకర్)
1980  సర్దార్ పాపారాయుడు
1980  యువతరం కదిలింది
1981  కిరాయి రౌడీలు
1981  పార్వతీ పరమేశ్వరులు
1981  ప్రేమాభిషేకం
1981  తోడు దొంగలు
1982  బొబ్బిలి పులి
1982  నా దేశం( కైలాసం)
1984  అల్లుల్లు వస్తున్నారు
1984  అనుబంధం
1984  మెరుపు దాడి బహదూర్
1984  సత్య హరిశ్చంద్ర
1985  అగ్ని పర్వతం (రుద్రయ్య)
1985  బుల్లెట్
1985  చట్టంతో పోరాటం (భారతి తండ్రి)
1985  ఓ తండ్రి తీర్పు
1985  శ్రీ దత్త దర్శనం( అత్రి)
1987  విశ్వనాథ నాయకుడు
1987  వక్త్ కా షాహేన్షా
1988  అంతిమతీర్పు
1988  చిన్నోడు పెద్దోడు
1990  చిన్న కోడలు
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express