Telugu Cartoon Jokes 2

Mister Medhavi


భర్త (భార్యతో): నా అభిమాన హీరో సినిమాలన్నీ నేను మూడేసి సార్లు చూస్తుంటాను తెలుసా?
భార్య : ఆశ్చర్యమేముంది, మీకు ఏది ఒకసారి చెపితే అర్థం కాదుగా !

హరి (రైల్వే స్టేషన్ లో నిలబడి, అధికారిని ఈ విధముగా అడుగుతున్నాడు):హైదారాబాద్ నుండి విశాఖపట్టణం ప్రయాణం ఎంత సేపండి?
అధికారి : ఒక సెకను సర్!
హరి : అంత త్వరగా వెళతామా............?


కనకారావు: తాయరమ్మతో, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మాఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు..........
తాయారమ్మ: ఎందుకు?
కనకారావు : మా ఆవిడా, పిల్లలు 


చింటూ(బంటి తో): చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి రా?
బంటి : తీపి తినడం.


తాయారు : (బంగారయ్యతో ) : మీరు అలా గట్టిగా చదివితే నేను టి .వి ఎలా చూసి చావను?


తాయారమ్మ(బంగారయ్యతో): భర్త సుఖముగా ఉండాలంటే భార్య ఏ నోము చేస్తే మంచిది?
బంగారయ్య : మూగనోము!
ఆఆఆఆఅ...............


చిన్నమ్మి: పెళ్ళైన మూడు రోజులకే మీవారు ఎలా పోయారు చిన్నమ్మి?
పెద్దమ్మి : మొదటి రోజు కాళ్ళు నొప్పంటే పట్టాను, రెండో రోజు నడుమునొప్పి అంటే పట్టాను, మూడో రోజు గొంతు నొప్పి అంటే పట్టాను, అంతే ..........?
ఆఆఆఆఆ.....................


చింటూ(బంటి తో ) : అరేయ్ కోడిని ఆంగ్లంలో(English) లో ఏమని పిలుస్తారు? అని అడిగాడు.
బంటి : కొక్కొరోకో (KOKKOROKO)
ఆఆఅ.............


అప్పారావు :(సుబ్బారావుతో):ఒరేయ్! "You are a fool" అంటే అర్థం చెప్పరా?
సుబ్బారావు :"నువ్వు ఒక వెధవవి" అని
అప్పారావు :అలా తిట్టవద్దురా సుబ్బారావు.
ఆఆఆ...................


సుబ్బులు : ఆ దొంగ మీ ఉంగరం, గడియారం, పర్స్  దోచుకొని వెళ్లిపోతుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండి? కనీసం అరిస్తే ఇరుగు పొరుగు ఎవరైనా వచ్చేవాళ్ళు కదా?
అప్పారావు : ఆ, నోరు తెరిస్తే లోపలున్న రెండు బంగారు పళ్ళు కూడా పీక్కు పోతాడని భయమేసిందే సుబ్బులు.
ఆఆఆఆఅ..........................అప్పారావు : మా తాత చాలా తెలివిగలవాడని, పైగా చాలా ముఖాలు ఉండేవని మానాన్న చెబుతుంటారు.
సుబ్బారావు : అలాగా! నువ్వు చూశావా?
అప్పారావు : లేదు. "మీ తాత బహుముఖ ప్రజ్ఞాశాలిరా! అని మా నాన్న చెబుతుంటారు.
ఆఆఆఆఆఆఅ..................


బంటి : "నాన్నా! నేను ఎక్కువ తింటూ ఉంటానని అరుస్తూ ఉంటావుగా. మరి నాకు పోటిలో మొదటి బహుమతి వచ్చింది తెలుసా?
నాన్నా : మంచిది! ఇంతకీ ఏ పోటీలో?
బంటి : తిండి పోటీలో
ఆఆఆఆ............


అప్పారావు : పొద్దున ఒకడు గాడిదను కొడుతుంటే వారించి ఆపా, దీన్నేమంటారు సుబ్బారావు?
సుబ్బారావు : సోదరప్రేమ!
ఆఆఆఆఆ...................


అప్పారావు(సుబ్బారావుతో): నువ్వు వాచ్ మన్ గా పనిచేస్తున్నావు కదా, దొంగలు పడితే ఎందుకు పట్టుకోలేదు.
సుబ్బారావు : నేను వాచ్ మన్ ని కాని కాచ్ మన్ ని కాదు.
ఆఆఆఆఆ.............................టీచర్ (బంటితో) : అరె ఆల్జీబ్రా అంటే  ఏమిటిరా ?
బంటి : అంటే అంటే  అన్ని  జీబ్రాలు  ఒకచోట కలిపితే దానిని ఆల్జీబ్రా అంటారు టీచర్.
ఆఆఆఆఆఆఆఆఆ............................ 


బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.
ఆఆఆఆఆఆఆ................................!


(ఇద్దరు వ్యక్తులు    మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)
  అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?
సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం,
                    విషం తాగితే  మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ  చిందులేస్తారు.


అప్పారావు(సుబ్బారావుతో): నాకు ఆస్ట్రేలియాకి కొద్దిగా ఉత్తరం  రాసిపెట్టు.
సుబ్బారావు: చిరునామా ఇవ్వు.
అప్పారావు: చిరునామా కోసమే రాయమన్నది.
ఆఆఆఆఆఆఆ....................


బంటి(వాళ్ళ నాన్నతో): నాన్నా, ఒక్కగ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు.
నాన్నా: నువ్వే వెళ్లి తెచ్చుకో, ఈసారి అడుగితే తన్నుతాను.
బంటి: సరే తన్నేటప్పుడైన తీసుకొని రా.
ఆఆఆఆఆఆఅ..............!


కమల్: నువ్వు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా. మరి నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు ఏం చేశావ్?
విమల్: ఆ సమయానికి కరాటే డ్రెస్ దొరకలేదు.
ఆఆఆఆఆఆఅ.....................!


హరి: నీ సైకిల్ ఎవరో దొంగలు ఎత్తుకుపోయారన్నావ్? మరి పోలీసులకు చెప్పావా?
సోము: ఆ! ఎందుకులే.....ఎలా వచ్చిందో అలాగే పోయింది!
ఆఆఆఆఆఆఅ....................


సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
ఆఆఆఆఆఆ.................


సరసు: వదినా గారూ! ఇంకా వంట మొదలెట్టలేదేమిటి?
అరసు: నీకెలా తెలుసు?
సరసు: ఆఅ.......మాడిన వాసన ఇంకా రాకపోతేనూ .......!శిష్యుడు:మనిషికి భవిష్యత్  తెలుసుకొనే శక్తి వస్తే ఏమవుతుంది గురువు గారు?
గురువు: ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు నాయనా! ఎన్ని ఆశ్రమాలైనా సరిపోవు!
ఆఆఆఆఆఆఅ .............

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్  అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన  వినయం లాటింది!
ఆఆఆఆఆఆఆఆఅ......................................


(సుబ్బులు సుబ్బారావుతో )
సుబ్బులు: మన పనిమనిషికి దొంగబుద్ధి ఉన్నట్టుంది.కొత్తవి రెండు పళ్ళేలు కనబడటం లేదు.
సుబ్బారావు: ఏ పళ్ళాలు?
సుబ్బులు: మనం హోటల్ కి వెళ్ళినప్పుడు సంచిలో తీసుకొచ్చాగా, అవే
ఆఆఆఆఆఅ...................

టీచర్(రాముతో):రాము విమానాన్ని ఎవరు కనుక్కొన్నారు?
రాము: రైట్ బ్రదర్స్ టీచర్.
టీచర్(సోముతో): సోము రైలును ఎవరు కనుక్కొన్నారు?
సోము: లెఫ్ట్ బ్రదర్స్ టీచర్.
ఆఆఆ............


చింటు(వాళ్ళ నాన్నా అప్పారావుతో): "నాన్నా నాకు ఇన్ని తెలివితేటలు ఎక్కడినుండి వచ్చాయి"?
అప్పారావు(చింటుతో): "నీవన్ని మీ అమ్మ తెలివితేటలు రా, నావి నాదగ్గరే ఉన్నాయి."
ఆఆఆఆఆఆఆఆఆఆఆ......................

పప్పు:"ATM నుండి డబ్బులు తీసుకుంటున్నాడు". ఇంతలో(దొంగ)
బిల్లు(దొంగ):" పప్పు వెనకలనుండి హ, హ నీ పాస్ వర్డ్ నేను చూశాను.అది 1458"
పప్పు:" హ, హ, హ కాదు, కాదు,  అది 1258"
ఆఆఆఆఆఆఆఆఆఆ ..........................

(ఇద్దరు స్నేహితురాళ్ళు ఇలా మాటలాడుకుంటున్నారు)
అమ్ములు: "మగవారి మీద నీ అభిప్రాయము ఏమిటి?
సుబ్బులు: "ఒక విషయం వారి చెవుల నుండి వెళ్తే ఆ విషయం మరొకరి నుండి బయటికి వస్తుంది".
సుబ్బులు:"మరి ఆడవారి మీద నీ అభిప్రాయం ఏమిటి?"
అమ్ములు:"ఒక విషయమ వారి రెండు చెవుల నుండి వెళ్లి వారి నోటి నుండి బయటకి వస్తుంది".
ఆఆఆఆఆఆఆఆఆఆ.............................

టీచర్: (బన్నితో) రైలు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చు?
బన్ని: "Speed Breakers" రైల్ ట్రాక్స్ మీద పెట్టి తగ్గించవచ్చు టీచర్.
ఆఆఆఆఆఆఆఆ..........................

"ఏరా పరీక్షా ఎలా రాశావు?" అడిగాడు కామేశం కొడుకు బాబిని.
బాబి: "కేక వందకు వంద వస్తాయి" తల ఎగిరేస్తూ చెప్పాడు బాబి.
కామేశం:"నేను నమ్మను" అనుమానంగా చూసాడు బాబిని.
బాబి:"నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ కూడా తీసుకొచ్చా. ఇదిగో చూడు" బ్యాగ్ లో నుండి తీస్తూ అన్నాడు బాబి.
ఆఆఆఆఆఆఆఆఆఆ...................................


(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బందువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?" నేను మీ అమ్మాయి "Evening Walk"  కి బయలుదేరామండి" అని పలకరించాడు వరహాల రావు.
ఆఆఆఆఅ............................చింటూ: "ఈ పెయింటింగ్ 200 ఏళ్ళ 10 రోజుల కిందటిది కదా?"
బంటి: "అంత సరిగ్గా ఎలా చెప్పగలవు?"
చింటూ: "10 రోజుల క్రితం దీన్నికొన్నప్పుడు షాపువాడు 200 ఏళ్లది అని నాకు చెప్పాడు."
ఆఆఆఆఆఆఆఆ.......................
(ఇంటర్వ్యూ జరుగుతోంది)
"మీ పేరు?"
"నా పేరు శ్రీ ......శ్రీ......శ్రీ .......శ్రీ.........శ్రీనివాస రావు".
"మీ పేరు ముందు అన్ని శ్రీలు ఎందుకు?"
"న....న...న......న......నాకు నత్తండి
ఆఆఆఆఆఆఅ........................చిన్ని: మీ అక్క వయసు యెంత?
కుట్టి: 25 ఏళ్ళు.
చిన్ని: కాని ఆమె నాతో 20 అని చెప్పిందే!
కుట్టి: ఆమె 5 ఏళ్ళకు లెక్కలు నేర్చుకున్నది.
ఆఆఆఆఆఆఆఆ .....................................!


చిన్నా: మీ నాన్నంటే మీ అమ్మకు యెంత గౌరవం! మీ నాన్నా తాగందే కాఫీ కూడా తాగట్లేదు.
మున్నా: అది కాదురా! మా నాన్నకు షుగర్. ఆయనకిచ్చాక పంచదార వేసుకొని మా అమ్మ తాగుతుంది.
ఆఆఆఆఆఆఆఆఅ.......................................... 

టీచర్: (నానితో):" హోంవర్క్ మీ నాన్నా చేసారా"?
నాని: "లేదు టీచర్, మా నాన్నా పెన్ను చేసింది".
ఆఆఆఆఆఆఆఅ.........................................
(ఫోన్ రింగయ్యింది)
సుబ్బారావు: హలో!బాబు మీ నాన్నకి ఫోన్ ఇవ్వు?
చింటు: మా నాన్న ఇంట్లో లేరండి.
సుబ్బారావు:సరే అమ్మకు ఇవ్వు.
చింటు: అమ్మ కూడా లేదండి.
సుబ్బారావు: ఇంకెవరూ లేరా?
చింటు: మా సిస్టర్ ఉంది.
సుబ్బారావు: అయితే ఆమెకివ్వు.
చింటు: ఉయ్యాలలోనుంచి తీస్తే ఏడుస్తుంది మరి...........ఇమ్మంటారా?
ఆఆఆఆఆఆఆఅ..........................


(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో.............ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్నా అమ్ములుతో.
ఆఆఆఆఆఆఆఆఅ...................
ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."
ఆఆఆఆఆఆఆఆఅ ....................
(అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ):
తెలుగు అతను: "మీ పేరు తెలుసుకోవచ్చా"?
                       ("Hello my I know your name please?")
అమెరికా అతను:"I am Bond........James Bond"
అమెరికా అతను:"and you?"
తెలుగు అతను: "I am sai........Venkata Sai..........Siva Venkata Sai...........Lakshminarayana Siva Venkata Sai...........Raja Sekhara Srinivasula Siva Venkata Sai.............Bommiraju Sitaraamanjeenyula Raja Sekhara Srinivasula Lakshminarayana Siva Venkata Sai............"
ఆఆఆఆఆఆఆఆఆఆ..............................
సరిత: (మమతతో) "అదేమిటి వదిన  మీరు పెట్టిన స్వీట్స్ తింటూవుంటే మీ కుక్కపిల్ల నేను పట్టుకున్న పళ్ళెం వైపు అదేపనిగా చూస్తున్నది."
మమత:(సరితతో) "చూడదు మరి, నువ్వు పట్టుకొని తింటున్న పళ్ళెం దానిదేగా మరి"!
ఆఆఆఆఆఆఆఆ................................


సుబ్బులు: "లైఫ్ బాయ్ సబ్బు పెట్టాను", ఎక్కడండి?
ముత్యాల రావు: ఆరోగ్యానికి మంచిదని T.V లో చెబితే తినేశా!
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ..........................................


అప్పారావు(సుబ్బారావుతో): ఈ దుకాణంలో ఏమి కొనవద్దురా, షావుకారు పచ్చి మోసగాడు" చెప్పాడు అప్పారావు.అదేమిటి అడిగాడు సుబ్బారావు.
" బిస్కట్ పాకెట్ పైన 'షుగర్ ఫ్రీ' అనివుంటే కొన్నానురా.ఇంటికెళ్ళి చూస్తే ఏ షుగరు లేదురా " కోపంగా అన్నాడు అప్పారావు సుబ్బారావుతో"
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ...................................

చింటూ:(బంటిని): ఇలా అడుగుతున్నాడు.
బంటి నీకు అన్ని పరీక్షలలో "" (సున్నా) మార్కులు వస్తున్నాయి కదా, మీ నాన్నా కొట్టటం లేదా?
బంటి:ఎందుకు లేదు, మా నాన్నా కొట్టేడానికి చేయి ఎత్తినప్పుడల్లా "జనగణ మన" అని పాడుతున్నాను. దానితో మా నాన్నా నిలబడిపోతున్నాడు. నేను అక్కడినుండి పరుగెత్తిపోతున్నాను, అని చెప్పాడు బంటి చింటుతో.
హహహహహహః .....................................................!అప్పారావు(సుబ్బారావుతో): ఈ దుకాణంలో ఏమి కొనవద్దురా, షావుకారు పచ్చి మోసగాడు" చెప్పాడు అప్పారావు.అదేమిటి అడిగాడు సుబ్బారావు.

" బిస్కట్ పాకెట్ పైన 'షుగర్ ఫ్రీ' అనివుంటే కొన్నానురా.ఇంటికెళ్ళి చూస్తే ఏ షుగరు లేదురా " కోపంగా అన్నాడు అప్పారావు సుబ్బారావుతో"

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ...................................

రాము: నా రాత చూసి మా మాష్టారు తెగ మెచ్చుకున్నాడు నాన్నా
నాన్నా: ఇంతకీ ఏమని?
రాము: పెద్దయ్యాక డాక్టర్ అవుతానని ...............!


చింటు:(బంటూతో): ఏరా!నీకు అన్నీ సబ్జెక్టులలో సున్నా మార్కులే వస్తాయి ఎందుకు? మీ నాన్నా ఏమి చేస్తుంటాడు?

బంటు:మా నాన్నా కోడి గ్రుడ్ల వ్యాపారం చేస్తుంటాడు!ఆఆఆ.................(జడ్జి దొంగతో)
జడ్జి : నువ్వు దొంగతనం చేసినప్పుడు CC కెమెరాలో రికార్డయింది తెలుసా ?
దొంగ : అయితే చూపించండి .
జడ్జి : చూశావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా?
దొంగ : చూశారుగా నా పర్ఫామేన్స్ . నచ్చితే DTA Donga అని టైప్ చేసి 65656 కి S M S చేయండి. Please Vote for me(దయచేసి నాకు ఓటు వేయండి)

అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!బాబురావు: ఇప్పటికే ఆరు ఐస్ క్రీములు తెచ్చుకుని తిన్నావ్? పెళ్ళివారు ఏమనుకుంటారే?
అమ్ములు: నా గురుంచేమనుకోరు. ప్రతిసారీ మీకని చెప్పే తెస్తున్నాను! ఆ.........


 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express