Social Icons

Pages

Featured Posts

Navvu Navvinchu

నవ్వు నవ్వించు 
కొన్ని వాక్యాలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, 'ఇది మనకీ వర్తిస్తుందే అనిపిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని...


సెల్ఫీ కామెంట్: 
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వచ్చాక మన ఫొటో తీసే స్నేహితుడు కూడా లేనంత ఒంటరి అయిపోయామని చెప్పడానికి ఉదాహరణ.
పాయింటే:
గర్ల్ ఫ్రెండ్ ఏదైనా ప్రశ్న వేస్తే నిజం చెప్పేయడమే మంచిది. ఎందుకుంటే, ఆల్రెడీ  తనకు విషయం తెలిశాకే మిమ్మల్ని అడిగే అవకాశాలు ఎక్కువ.
అమ్మాయితో స్నేహం చేయాలంటే: 
ఏముంది... నేను నిన్ను ప్రేమిస్తున్నా' అని చెప్పండి. వెంటనే 'నాకు అలాంటి ఉద్దేశం లేదు, మనం స్నేహితులం మాత్రమే' అంటుంది. సింపుల్..!
మన దగ్గరే! 
 కబడ్డీ నిజంగా మన దేశంలోనే పుట్టిందని పక్కాగా చెప్పొచ్చు. పాపం ఓ వ్యక్తి ఏదో సాధించాలని ప్రయత్నిస్తుంటే పదిమందీ అతని కాళ్లు పట్టుకొని కిందకి లాగే ప్రయత్నం చేసేది అందులోనే కదా. 
అబ్బాయిలూ జాగ్రత్తా! 
అమ్మాయి మౌనంగా ఉంటే జాగ్రత్త సుమా. అందులో చాలా అర్థాలుంటాయి. ఆమె... 
1. ఎక్కువగా ఆలోచిస్తుండొచ్చు .
2. ఎదురు చూసీ చూసీ కోపంగా ఉండొచ్చు
 3. ఏదో ఒక క్షణంలో అగ్నిపర్వతం బద్దలవ్వొచ్చు
4. లోలోపలే ఏడుస్తుండొచ్చు 
5. మతి పోగొట్టే విషయం చెప్పడానికి సిద్ధమవుతుండొచ్చు  
6. పైవన్నీ కూడా కావొచ్చు కాబట్టి..  మాట్లాడే ముందే కాస్త ఆలోచించండి
ఓ స్నేహితుడి మాట... 
కాలేజీ జీవితం రిలయన్స్ లాంటిది: ప్రపంచం మీ చేతుల్లో 
బ్యాచిలర్ జీవితం ఎయిర్ టెల్ లాంటిది : ఇంత స్వేచ్ఛ ఇంకెక్కడ? 
ఎంగేజ్ మెంటు ముందు ఐడియా: మీ జీవితాన్నే మార్చేస్తుంది
పెళ్లయ్యాక వోడాఫోన్: ఎక్కడైనా నెట్ వర్క్ ఫాలో అవుతుంది 
పిల్లలు పుట్టాక బీఎస్ఎన్ఎల్ : అన్ని లైన్లూ బిజీగా ఉంటాయి
 ...కానీ స్నేహం ఎల్‌ఐసీ లాంటిది : జీవితంతో పాటూ, జీవితానంతరం కూడా.
మంచి నీళ్లు తెచ్చివ్వు
చంటి: అమ్మా ఒక గ్లాస్ మంచి నీళ్లు తెచ్చివ్వు. 
తల్లి: నువ్వే వెళ్లి తెచ్చుకుని తాగు. ఇంకోసారి అడిగితే దెబ్బలు పడతాయి. 
చంటి: సరేనమ్మా... కొట్టడానికి వచ్చేటప్పుడు నీళ్లు తెచ్చివ్వు. 
ఓస్ అంతేనా!
         "
సార్! మెడికల్ కాలేజీ వాళ్ళు త్వరగా ఒక శవాన్ని పంపమని ఫోన్ చేశారు. అంది నర్సు.
           "అలాగా! అయితే ఐదో నెంబరు బెడ్ మీదున్న రోగిని ఆపరేషన్ కి సిద్దం చెయ్యి". చెప్పాడు డాక్టర్. 
పంచ్ పడింది !
           భర్త: నీవు ఏది కట్టినా దానికి అందం వస్తుంది కాంతం.
           భార్య: అందుకే కదా! మిమ్మల్ని కట్టుకున్నా. 
నిజం !
          "తెలివైనవాడు చూపిన ప్రతిభకు చేతకానివాడు పెట్టే పేరు?"
           "పూర్వజన్మ సుకృతం". 
వెరీ సింపుల్!
          హీరోయిన్ కావాలంటే?"
         "శరీరం పట్ల శ్రద్ధ, దుస్తుల పట్ల అశ్రద్ధ ఉంటే చాలు."
ఎక్కడైనా ఇంతే !
          "స్కూల్ టీచర్ కి జైలర్ ఉద్యోగం ఇవ్వరెందుకు?'
           "అల్లరి చేస్తే బయటికి పంపుతాను, అంటాడు కాబట్టి."
వాటర్ షాక్ !
          "ఫైర్ ఆఫీసర్ మూర్ఛ పోయేదేప్పుడు?'
          "వాటర్ ట్యాంకుకు నిప్పు అంటుకున్నదని ఫోన్ వచ్చినప్పుడు."
ఆస్కార్ నటి !
         "ప్రతి ఇల్లాలిలో ఒక మహానటి ఎప్పుడు కనపడుతుంది?"
           "ప్రతి నెలా ఒకటో తారీఖున."
కొండంత ధైర్యం !
          "చొక్కాకి ఎడమ ప్రక్కనే జేబు ఎందుకుంటుంది?"
           "జేబులో డబ్బు పెట్టుకుంటే, గుండె ధైర్యంతో తిరగవచ్చునని."
మా  బాబే మా బాబే!
           "నా పేరు బల్బుపై రాస్తున్నావెందుకురా?"
           "మీ పేరు వెలుగిస్తున్నా నాన్న గారూ."
కోడి కవిత 

కూస్తే - లేస్తారు!

లేస్తే - కోస్తారు!!
పిచ్చిమాలోకం 
తన భర్తకు గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ ను "మా ఆయన హృదయంలో నేను కాక మరెవరైనా కనిపించారా?" అని అమాయకంగా అడిగేది. 
ఔరా!
నవ్వమని చెప్పే ఒకే ఒక్కడు?
ఫోటో గ్రాఫర్ 

పుస్తకం ?
తల దించుకొని చదివితే, తల ఎత్తుకునేలా చేసేది!
తడపకుండా తడిగా ఉండేది?
నాలుక!
తమాషా ప్రశ్నలు 
  • వాహనాలకు ఉండని టైర్లు? (సెటైర్లు) 
  • భార్య లేని పతి?(అల్లోపతి)
  • కూర్చోలేని హాలు? (వరహాలు)
  • తినలేని కాయ? (లెంపకాయ)
  • అందరికీ ఇష్టమైన కారం? (ఉపకారం)
జర్నలిస్ట్ కి దేవుడు ప్రత్యక్షమైతే? (ఇంటర్యూ చేస్తాడు!)
తాజ్ మహల్ ఎక్కడ ఉంది? (కట్టిన చోటే!)
చలికాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది? (కప్పు ఖాళీ అవుతుంది!)
ఆటలు ఆడని ప్లేయర్? (సీడీ ప్లేయర్!)
డ్రైవర్ లేని బస్? (సిలబస్!)
రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలా? (రసం తీసి!)
గుడికి వెళ్లినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు? (నుదిటికి!)
నాలుక పై పెడతారు గానీ మింగరు..... ఏమిటది? (తపాలా బిళ్ళ!)
దోమ తన పిల్లని సర్కస్ గుడారం లోకి వెళ్ళద్దని చెప్పింది. ఎందుకు? (అందరూ చప్పట్లు కొడతారు కాబట్టి!)
బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? (పట్టినంత మంది!)
ఆఫ్రికా వాళ్ళు అరటిపండు ఎలా తింటారు? (పండు ఒలచుకొని!)
ఇంట్లో బోలెడు డబ్బు, నగలు ఉన్నాయి. ఒక దొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడూ ఎవరూ లేరు. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు. ఎందుకు? (అది తన ఇల్లే కాబట్టి!)
అవునవును.....
అమ్మాయిలకు సంతృప్తి ఉండదు, సిల్కీ జుట్టున్న వాళ్లు ఉంగరాల జుట్టు కోరుకుం టారు. ఉంగరాల జుట్టున్న వాళ్లు వేలు ఖర్చు పెట్టి దాన్ని సిల్కీగా మార్చుకుంటారు. కానీ అబ్బాయిలు అల్ప సంతోషులు, అసలు తల మీద జుట్టంటూ ఉంటే చాలనుకుంటారు.
నిజమే! 
భారత్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఒక ఎర్రలైటు చేయలేని పని, ఒక నల్ల పిల్లి చేస్తుంది. ఎంత మందినైనా ఒక్క క్షణంలో ఉన్న చోటే ఆపేస్తుంది.
అయ్యో పాపం
ఓ కుర్రాడి బాధ: గర్ల్ ఫ్రెండ్ దొరికాకే తెలిసింది... వంద రూపాయలకు పైగా ఖరీదుండే చాక్లెట్లు కూడా ఉంటాయని.
ఈ కాలం కుర్రాళ్లు... 
ఇంటర్వ్యూలో మేనేజర్: మా సంస్థ నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు? 
అభ్యర్థి: ఉద్యోగం
మేనేజర్: అదే... ఉద్యోగం ద్వారా ఏం ఆశిస్తున్నావూ అని... 
అభ్యర్థి: జీతం సర్
ఎవరు నువ్వు?
తండ్రి: చిన్నా... ఈసారి లెక్కల్లో ఫెయి లైతే నీకూ నాకూ ఏ సంబంధం ఉండదు. 
చిన్నా: అలాగే నాన్నా
ఫలితాల తరవాత 
తండ్రి: చిన్నా... పరీక్ష ఏమైంది?
చిన్నా: ఎవరు నువ్వు?
సింగాకా బేటా

“రేపు సూర్యుడి మీద పాఠం చెబుతాను .... డుమ్మా కొట్టకుండా అందరూ రావాలి” పిల్లలకు వార్నింగ్ ఇచ్చింది సైన్స్ టీచర్ ప్రమీల. 
“సారీ టీచర్ ... అంత దూరం మా డాడీ పంపించడు” చెప్పాడు రామ్ సింగ్.
నీ తాత దిగిరావాలి

“ఐ లవ్ యూ” ప్రపోజ్ చేసింది కోడిపుంజు.
“సారీ ... ఐ కాంట్” ముఖం తిప్పుకుంది పెట్ట.
“నీకోసం ఏమైనా చేస్తా... గుండు ఎత్తమంటావా?" తొడకొట్టింది పుంజు. 
“గుడ్డు పెట్టు చాలు” ఠపీమని చెప్పింది పెట్ట.
ఒత్తు ఒక్కటే తేడా !
“పులికి, మేకకి తేడా ఏమిట్రా?" ప్రశ్నించాడు పంతులు.
“ఒకటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు” గోడకు కొట్టిన బంతిలా అన్నాడు సోము. 
భలే ఛాన్సు
“ఐడియాలో జాబ్ ఉంది. చేస్తావా..” అని అడిగాడు సోము 
"నేను టెన్త్  వరకే చదివాను మరి?” అని అన్నాడు రాజు 
“టెన్త్ ఫెయిలయినా పర్వాలేదు” అని అన్నాడు సోము 
"అయితే ఓకే ... జీతం ఎంత?” అని అన్నాడు రాజు 
"నెలకు 30 వేలు" “నిజమా!... ఇంతకూ ఏం చేయాలి?"  అని అడిగాడు రాజు
 “ఐడియా టవర్ మీద కూచుని ఎయిర్ టెల్ సిగ్నల్స్ ఆపాలి" అని అన్నాడు  సోము
రాజుగారి తెలివి
“మహారాజా, యుద్ధానికి సిద్ధముగా ఉండమని పక్క దేశపు రాజు ఎస్.ఎం.ఎస్. పంపించాడు. ఏమి కర్తవ్యం" చెప్పాడు మహామంత్రి
"SMS Sending Failed అని  రిప్లయ్ ఇవ్వు" ఆజ్ఞాపించాడు రాజు.
ముందు జాగ్రత్త !

"రోజీ.... ఇక లాభం లేదు. ఈ రోజు రాత్రి సరిగ్గా రెండు గంటలకు మనం ఈ ఊరు విడిచి పారిపోవాలి. సరిగ్గా ఆ టైమ్ కు లగేజ్ తో నీవు సిద్ధంగా ఉండాలి" చెప్పాడు ప్రియుడు రాకేష్. 
నువ్వేమీ బెంగ పెట్టుకోకు  రాకేష్. మా నాన్న నిన్ననే నా లగేజ్ పాక్ చేసి పెట్టాడు" బదులిచ్చింది రోజీ ప్రశాంతంగా... 
పది రూపాయలే!

"నువ్వు మీ అమ్మ ద్వారా తెలుసుకుని చేసిన గుత్తి వంకాయ కూర ఖరీదు 155 రూపాయలు" కొత్తగా కాపురం పెట్టిన అప్పారావు  భార్యతో అన్నాడు.
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?” ఆశ్చర్యపోయింది కాంతం.
"ఇదిగో ఎస్.టి.డి. బిల్' చూపెట్టాడు  అప్పారావు.
పోలిక

"ప్రేమకు, పెళ్లికి తేడా ఏంటి?" అడిగాడు సురేష్,
"ప్రేమ సైకిల్ ప్రయాణమైతే, పెళ్లి పడవ ప్రయాణం" చెప్పాడు రమేష్
:అదెలా?" ఆరా తీశాడు సురేష్.
 "ఇష్టం లేకపోతే సైకిల్ దిగిపోవచ్చు. కానీ పడవ ప్రయాణంలో మధ్యలో దిగడం కుదరదు కదా" వివరించాడు రమేష్ 
తిట్లు నీకు ..... విషయం నాకు

“సార్, మీ ఆవిడ నుండి ఫోన్” రిసీవర్ అందించబోయాడు సెక్రటరీ.
"రెండు నిమిషాల తర్వాత ఇవ్వు" చెప్పాడు బాస్.
"ఎందుకు సార్?" ఆశ్చర్యపోయాడు సెక్రటరీ.
"ఆవిడ ఎవరికీ ఫోన్ చేసినా రెండు నిముషాల వరకు ఆగకుండా తిట్టి, ఆనక అసలు విషయం చెబుతుంది. చెప్పాడు బాస్. 
ఈత వస్తే సరి...

'ఏంటయ్యా... విచిత్రంగా కోడికి ఈత నేర్పిస్తున్నావ్.... '
డాక్టర్ నన్ను సీ-ఫుడ్స్ మాత్రమే తినమన్నాడు.... '
'అయితే...' 
'నాకు చేపలు అస్సలు నచ్చవు. అందుకే కోడికి ఈత నేర్పిస్తున్నా!'
థ్రిల్ ఉండాలిగా! 

వెంకట్రావుకి మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చిన మొదటిరోజే తల పగిలి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి పరామర్శించడానికి వెళ్లారు స్నేహితులు ...
 “అయ్యో ఎలా జరిగింది సార్..." 
"ఏం లేదయ్యా... ప్రమోషన్ లెటర్ తో  ఇంటికెళ్లి మా ఆవిడతో వెరైటీగా . చెబుదామని... 
'ఈరోజు నుంచి నువ్వు మేనేజర్ తో  కాపురం చేయాలి...' అన్నానంతే!" నీరసంగా మూలుగుతూ చెప్పాడు వెంకట్రావ్.
బాయ్స్ లవ్ క్యాలెండర్

జనవరి - రోజ్
ఫిబ్రవరి - ప్రపోజ్
మార్చి - గిఫ్ట్
ఏప్రిల్ - లిఫ్ట్
మే -  చాటింగ్
జూన్ - డేటింగ్
జూలై - మిస్ యు
ఆగస్ట్ - కిస్ యూ
సెప్టెంబర్ - హు ఆర్ యు
అక్టోబర్ - హేట్ యూ
నవంబర్ - రెస్ట్ 
డిసెంబర్ - నెక్ట్స్  
కంటికి రెప్పల్లే..... !

'స్నేహమంటే మీదేనయ్యా ... ఆత్మహత్య చేసుకోబోయిన మిత్రుడిని మీ ప్రాణాలకు తెగించి కాపాడారు" అని మెచ్చుకున్నాడు దారినబోయే దానయ్య. 
"స్నేహమా .... వంకాయా?  మేమిద్దరం వీడికి అప్పిచ్చినోళ్లం. వీడు చస్తే మా బతుకు బస్టాండే " అని ఏక కంఠంతో అరిచారు సుబ్బిశెట్టి, రామిశెట్టి.
ఇదేం న్యాయం?

"పర్యావరణ రక్షణ కోసం మొక్కలు పెంచమని చెప్పేది గవర్నమెంటే... ఎందుకు పెంచావని బొక్కలో వేసేదీ గవర్నమెంటే?" వాపోయాడు జోగినాథం.
"ఇంతకూ నీవు పెంచిన మొక్కలేంటి?" అడిగాడు రామనాథం. "గంజాయి మొక్కలు" చెప్పాడు జోగినాథం.
సూక్తి ముక్తావళి

“ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దాని నుండి అందే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది."
అనుభవసారం!

"సంసారం సుఖంగా సాగాలంటే రెండే రెండు మార్గాలున్నాయి" 
చెప్పాడు గురువు.
"అవేమిటి గురూ?" చేతులు కట్టుకుని ప్రశ్నించాడు శిష్యుడు.
 "ఒకటి - తప్పు నీదయితే ఒప్పుకో; 
రెండు - తప్పు తనదైతే నోరు మూసుకో" బోధించాడు గురువు.
తిరకాసేల?

“దేవుడా .... నాకు బాధలు ఇవ్వు. దుఃఖం ఇవ్వు. టెన్షన్ ఇవ్వు. నరకం ఇవ్వు. హింస ఇవ్వు. టార్చర్ ఇవ్వు” అని ప్రార్థించాడు యువకుడు
“ఈ సుత్తి అంతా ఎందుకు? లవర్ కావాలని సూటిగా అడగొచ్చు కదా!” కరుణించాడు దేవుడు.
తెలుగు సంగీతం చాల్లే

“అమ్మా... నాకు కర్నాటక సంగీతం నేర్చుకోవాలని ఉందే" గోముగా అడిగింది సుందరి.
“సంగీతం నేర్చుకోడానికి కర్నాటక దాకా ఎందుకమ్మా -- మనూళ్లో నేర్చుకుందువుగానిలే" బుజ్జగించింది తల్లి తాయారమ్మ.
ప్రేమ గణితం
అమాయకుడైన అబ్బాయి + తెలివైన అమ్మాయి = పర్స్ ఖాళీ 
తెలివైన అబ్బాయి + సత్తెకాలపు అమ్మాయి =  ప్రెగ్నెన్సీ 
తెలివి తక్కువ అబ్బాయి + తెలివి తక్కువ అమ్మాయి = మ్యారేజీ 
తెలివైన అబ్బాయి + తెలివైన అమ్మాయి = ఫ్రెండ్ షిప్
ఏమీ లేదనే.. 

“నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు అలేఖ్యా?” అడిగాడు మాధవ్..
“నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నా డియర్. ఏదైనా ఉంటే నిన్నీ పాటికి ఎవరో ఒకరు ప్రేమించి ఉండేవారుగా.” గోముగా చెప్పింది అలేఖ్య.
ఎలా పోయారు  అక్కా?
యాదయ్య: బావగారు ఎలా చనిపోయారు అక్కా?సుబ్బమ్మ: మొన్న హఠాత్తుగా గుండెల్లో నొప్పొస్తే డాక్టర్ దగ్గరికెళ్లామన్నా వినకుండా.. గూగుల్ లో చిట్కాలు వెతుక్కుంటూ కూర్చున్నారన్నయ్యా! కన్నీటితో ఏడుస్తూ చెప్పింది సుబ్బమ్మ.
సలహాల వైద్యుడు 

“ఈ మధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్” చెప్పాడు మదన్.
కళ్లు పరీక్షించి "కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేయండి" సలహా ఇచ్చాడు డాక్టర్ చిదంబరం.
నాదెప్పుడూ ఒకటే మాట!

"అప్పు తీసుకుని ఏడాది దాటిపోయింది .. ఇంతవరకు బాకీ తీర్చే సూచనలేవీ కనిపించడం లేదు" అని నిలదీశాడు సుబ్బిశెట్టి.
“మళ్లీ అడుగుతావేం? అప్పు తీసుకున్నప్పుడే చెప్పాగా..” అన్నాడు సుబ్బయ్య.
"ఏం చెప్పావు?” నొసలు చిట్లించాడు సుబ్బిశెట్టి.
"నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని” తాపీగా బదులిచ్చాడు సుబ్బయ్య. 
స్వర్గసీమలో...

ఏమండీ .. స్వర్గంలో భార్యాభర్తలను ఒకే చోట ఉంచరట. ....” టీవీలో మోక్షానంద స్వామి ప్రవచనాలు వింటూ గట్టిగా అరిచింది సుబ్బలక్ష్మి.
“అలా ఉంచితే అది స్వర్గమెలా అవుతుందే ...” వంటింట్లోంచి బదులు పలికాడు వీరబాబు.
చీమాయణం 
తెలివైన చీమ - Brilli 'ant' 
గణాంకాల చీమ - Account 'ant'
బానిస చీమ - Serv'ant' 
అద్దెకుండే చీమ - Ten 'ant' 
ఉగ్రవాది చీమ - Milit 'ant' 
గర్భవతి చీమ - Pregn 'ant' 
రెడీమేడ్ చీమ - Inst 'ant'

Jokes in Telugu - చిలిపి ప్రశ్నలు

చిలిపి ప్రశ్నలు 
కొన్ని వాక్యాలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, అలాంటి కొన్ని చిలిపి ప్రశ్నలు వాటి సమాధానములు  
నీరు లేని వెల్ ఏమిటి? ట్రావెల్
కనిపించని వనం ఏమిటి? పవనం.
గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? పకోడి
ఆయుధంలేని పోరాటమేమిటి? మౌనపోరాటం.
వీసా అడగని దేశమేమిటి? సందేశం.
అందరూ నమస్కరించే కాలు ఏమిటి? పుస్తకాలు
అందరూ భయపడే బడి ఏమిటి? చేతబడి.
వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? ఫైరింగ్
ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? న్యూస్ పేపర్.
పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? గ్రానైట్
మనిషి కాళ్ళు ఎంతపొడవు ఉండాలి? నేలకు అందేంత!
ఆ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ లేరు. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?  అది తన ఇల్లే కాబట్టి!
ఆఫ్రికా గిరిజనులు అరపండు ఎలా తింటారు? ఒలుచుకొని !
బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? పట్టినంత మంది!
దోమ తన పిల్లని సర్కస్ గుడారంలోకి వెళ్ళద్దని చెప్పింది. ఎందుకు?  అందరూ చప్పట్లు కొడతారు కాబట్టి!
తన పిల్ల కనబడకపోతే కంగారు ఏమని ఏడుస్తుంది? 'నా జేబు ఎవరో కొట్టేశారు!' అని!
గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు? నుదుటికి!
నాలుకపై పెడతారుగానీ మింగరు.. ఏమిటది? తపాలా బిళ్ళ!
చింటూ చాల్-లేట్ ఇస్తే తినలేదు ఎందుకు?చాకును ముందిచ్చినా లేటుగా ఇచ్చినా తినలేడుగా!
రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు. ఎలా? రసం తీసి!
డ్రైవర్ లేని బస్ ? సిలబస్!
చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది? కప్పు ఖాళీ అవుతుంది.
ఆటలు ఆడని ప్లేయర్? సీడీ ప్లేయర్!
తాజ్ మహల్ ఎక్కడ ఉంది? కట్టిన చోటే!
జర్నలిస్టుకి దేవుడు ప్రత్యక్షం అయితే.....? ఇంటర్వ్యూ చేస్తాడు!!
జూ అధికారి నూతన దంపతులను ఎలా ఆశీర్వదిస్తాడు? "చిలకా గోరింకల్లా " వుండండి!!
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్క లాడింది, ఏమిటది?కవ్వం!
కాగితాలు చింపుతాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కాని బిచ్చగాడు కాదు.. ఎవరతను? కండక్టర్
గొడుగు కాని గొడుగు? పుట్టగొడుగు
కాయ కాని కాయ? మెడకాయ
మందు కాని మందు? కామందు
గ్రహం కాని గ్రహం? అనుగ్రహం
మే నెలలో పుట్టిన నత్త ? జవాబు: మేనత్త!
దుర్గకి పట్టిన గతి ? జవాబు: దుర్గతి!
కోడి కాని కోడి ? జవాబు: పకోడీ!
పండు కాని పండు ? జవాబు: విభూది పండు!
పురం గాని పురం? జవాబు: కాపురం!
 తాళి కాని తాళి ? జవాబు: ఎగతాళి
తార కాని తార? జవాబు: సితార
పాలు కాని పాలు? జవాబు: కోపాలు
కాయ గాని కాయ ?జవాబు: తలకాయ!
 సందు కాని సందు? జవాబు: పసందు
పతి కాని పతి? జవాబు: తిరుపతి
కారు గాని కారు? జవాబు: షావుకారు
హారం గాని హారం? జవాబు: ఫలహారం!
మాట కాని మాట? జవాబు: టమాట
దానం గాని దానం? జవాబు: మైదానం!
దారా కాని దార? జవాబు: పంచదార
శిక్ష గాని శిక్ష? జవాబు: బాల శిక్ష
తాళం కాని తాళం? జవాబు: పాతాళం
మామ గాని మామ? జవాబు: చందమామ!
జనము కాని జనము? జవాబు: భోజనము
వరం కాని వరం? జవాబు: కలవరం
 రెంటు గాని రెంటు?జవాబు: కరెంటు.
రాణి కాని రాణి? జవాబు: పారాణి
కులం కానీ కులం? జవాబు: గురుకులం
రసం గాని రసం? జవాబు: నీరసం
దారం గాని దారం? జవాబు: మందారం
తారు కాని తారు? జవాబు: జలతారు
మత్తు కాని మత్తు? జవాబు: గమ్మత్తు
కట్టు గాని కట్టు ? జవాబు: తాకట్టు
గోళం కాని గోళం? జవాబు: గందరగోళం
హారం కాని హారం? జవాబు: వ్యవహారం
రాగి కాని రాగి? జవాబు: బైరాగి
కారం కాని కారం? జవాబు: ఉపకారం
మొగ్గ కాని మొగ్గ? జవాబు: పిల్లి మొగ్గ
టూరు గాని టూరు? జవాబు: గుంటూరు
బడి కాని బడి? జవాబు: రాబడి    
రాజు గాని రాజు? జవాబు: తరాజు
రాయి కాని రాయి? జవాబు: కిరాయి
దేహం గాని దేహం? జవాబు: సందేహం
దారి కాని దారి? జవాబు: గోదారి
దేశం గాని దేశం?జవాబు: సందేశం
నాడ కాని నాడ? జవాబు: కాకినాడ
కీలు కాని కీలు? జవాబు: వకీలు
వెల కాని వెల? జవాబు: కోవెల

తెలుగు కార్టూన్ జోక్ - ఫోటో తీసేటప్పుడు ఏం చేశారు?/Jokes in Telugu/Telugu Funny Cartoon Jokes/Jokes

తెలుగు కార్టూన్ జోక్ - ఫోటో తీసేటప్పుడు ఏం చేశారు?/Jokes in Telugu/Telugu Funny Cartoon Jokes/Jokes
In this video, the teachers take the school children to the police station for a field study ... a conversation that takes place between them

తెలుగు కార్టూన్ జోక్ - ప్రకటన!/Jokes in Telugu/Telugu Cartoon Joke/Telug...

In this video we heard a Telugu cartoon joke. Applications are solicited from young people who are interested in working in our sweet shop. Eligibility: Candidates must be diabetic "

Cartoon Jokes

Yoga, yogam
Social trend
Hundred Years!
Can't husband adjust!
See Brother!
Switch Off!
How is it work's?
Fasting
ఉపవాసం
Sorry Guruji
సారీ గురూజీ
Vaddanna Vastaru
Sariki Sari
Modern Mother
Mouna Vratam
Life Lesson
Impossible
Feeling a Crow
Breakup!
Status Coma
Last Desire
Duel Sim
Unlimited jokes
Funny Cartoon jokes - 54
Funny Cartoon jokes - 39
Funny Cartoon jokes - 34
Funny Cartoon jokes - 30
Funny Cartoon jokes - 92
Funny Cartoon jokes - 60
Funny Cartoon jokes - 59
Funny Cartoon jokes - 58
Funny Cartoon jokes - 57
Funny Cartoon jokes - 53
Funny Cartoon jokes - 52
Funny Cartoon jokes - 50
Funny Cartoon jokes - 51
Funny Cartoon jokes - 55
Funny Cartoon jokes - 56
Funny Cartoon jokes - 38
Funny Cartoon jokes - 37
Funny Cartoon jokes - 36
Funny Cartoon jokes - 35
Funny Cartoon jokes - 33
Funny Cartoon jokes - 32
Funny Cartoon jokes - 31
Funny Cartoon jokes - 29
Funny Cartoon jokes - 28
Funny Cartoon jokes - 93
Kisukku
Funny Cartoon jokes - 84
Funny Cartoon jokes - 85
Funny Cartoon jokes - 86
Funny Cartoon jokes - 87
Funny Cartoon jokes - 88
Funny Cartoon jokes - 89
Funny Cartoon jokes - 90
Funny Cartoon jokes - 91
Funny Cartoon jokes - 75
Funny Cartoon jokes - 79
Funny Cartoon jokes - 72
Funny Cartoon jokes - 71
Funny Questions - Naughty Answers 1
Navvu Navvinchu 1
Funny Cartoon jokes - 82
Funny Cartoon jokes - 81
Funny Cartoon jokes - 80
Funny Cartoon jokes - 69
Funny Cartoon jokes - 69
Funny Cartoon jokes - 70
Funny Cartoon jokes - 73
Funny Cartoon jokes - 76
Funny Cartoon jokes - 83
Funny Cartoon jokes - 72
Funny Cartoon jokes - 74
Funny Cartoon jokes - 77
Funny Cartoon jokes - 78
Funny Cartoon jokes - 68
Funny Cartoon jokes - 67
Funny Cartoon jokes - 66
Funny Cartoon jokes - 65
Funny Cartoon jokes - 64
Funny Cartoon jokes - 63
Funny Cartoon jokes - 62
Telugu Cartoon Jokes
Telugu Cartoon Joke 1
Taalam Veyandi
Good thining
Back to Back

తెలుగు కార్టూన్ జోక్ - ఔరా! /Jokes in Telugu/Telugu Comedy Cartoon Jokes...

In this video we heard a Telugu cartoon joke. పోలీసు అవాక్కయ్యేదెప్పుడు? “పట్టపగలు దొంగతనమా ..." అంటే, “నాకు రేచీకటి... రాత్రులు కుదరదు" అని దొంగ బదులిచ్చినప్పుడు! This channel has a lot of Telugu Riddles, cartoon jokes, Telugu funny jokes and so on. This is purely an entertainment channel.

నవ్వు నవ్వించు/Best Telugu Comedy Jokes/Cartoon Jokes in Telugu/Funny Telugu Jokes/Funny Jokes

Let's enjoy listening to some Telugu cartoon jokes in this video. This channel has a lot of cartoon jokes, Telugu funny jokes and so on. This is purely an entertainment channel.

అదేహాయి-కార్టూన్ జోక్/Best Telugu Cartoon Jokes/Jokes in Telugu/Telugu Funny Jokes/Telugu Comics

ఈ వీడియోలో టి.వి బాగుచెయ్యడానికి వచ్చిన అతనితో ఆ ఇంటి యజమాని ఈవిధంగా అంటున్నాడు. అదేహాయి అనే ఒక జోక్ ఏమిటో విందాము.
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express